సంక్రాంతికి ఒక వికెట్ పడిందా..?

shami
సంక్రాంతి అంటేనే తెలుగు వాళ్లకి సినిమా పండగ అనుకునేలా ఉంటుంది. సంక్రాంతికి స్టార్ సినిమాల ఆసక్తికరమైన ఫైట్ ఆడియన్స్ కు మస్త్ హబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది. ఈ పొంగల్ కి ముచ్చటగా మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ముందుగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ వస్తుంది. ఈ సినిమాను శంకర్ డైరెక్ట్ చేసారు. కొన్నాళ్లుగా ఏమాత్రం ఫాంలో లేని శంకర్ ఈ సినిమాను చేయడం వల్ల సినిమాపై ముందు నుంచి బజ్ లేదు.
ఓ పక్క దిల్ రాజు అసలు పెట్టింది ఎంత బడ్జెట్టో తెలియదు కానీ బడ్జెట్ 300 నుంచి 400 కోట్లు అంటుంటే అసలు అంత ఖర్చు ఎలా అయ్యిందబ్బా అనుకుంటున్న వారు ఉన్నారు. ఐతే శంకర్ గారు కేవలం 75 కోట్లు పాటలే తీస్తే కాకుండా ఎలా ఉంటుందని అనిపిస్తుంది. గేమ్ ఛేంజర్ సంక్రాంతికి వచ్చిన మొదటి సినిమా. ఐతే ఈ సినిమా మొదటి ఆట పడగా వస్తున్న టాక్ చూస్తుంటే మిశ్రమంగా ఉంది.
శంకర్ మార్క్ భారీ తనం అయితే ఉంది కానీ సినిమా రెగ్యులర్ కథతోనే వచ్చిందని అంటున్నారు. రామ్ చరణ్ తన బెస్ట్ ఇచ్చినా కూడా సినిమాను నిలబెట్టే స్టఫ్ లేదని చెప్పుకుంటున్నారు. ఐతే సినిమాకు పాజిటివ్ కామెంట్స్ కన్నా ట్రోల్స్ ఎక్కువగా ఉన్నాయి. మరి ఈ టాక్ తో సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి. సంక్రాంతికి రాబోతున్న సినిమాల్లో ఒక వికెట్ పడినట్టే అనిపిస్తుంది. మరి మిగతా రెండిటిలో ఫలితాలు ఎలా ఉంటాయన్నది చూడాలి. గేమ్ ఛేంజర్ విషయం లో మిగతా విషయాలు ఎలా ఉన్నా రాం నందన్, అప్పన్న పాత్రల్లో రామ్ చరణ్ మాత్రం అదరగొట్టాడు. ఐతే కథ కథనాలు రొటీన్ గా అనిపించడం వల్ల సినిమా టాక్ మాత్రం డిఫరెంట్ గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: