జేసీబీలతో ఆ తొక్కుడేంటి సామీ.. గేమ్ ఛేంజర్ మూవీకి ఆ యాక్షన్ సీన్ హైలెట్!
ప్రీ క్లైమాక్స్ లో ఆ సీన్ ను ఆ విధంగా డిజైన్ చేశారని ఎవరూ ఊహించరు. సినిమాలో యాక్షన్ డోస్ మరీ శృతి మించకుండా ఉంది. గేమ్ ఛేంజర్ మూవీ ఫైనల్ రిజల్ట్ తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగక తప్పదు. సినిమాలో యాక్షన్ సీన్స్ రొటీన్ గా ఉన్నాయని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. అయితే ఐఏఎస్ ఆఫీసర్ కు శృతి మించి యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేయలేరు.
ఈ సినిమాలో హెలికాఫ్టర్ సీన్స్, షాట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఆ సీన్స్, షాట్స్ అన్నీ బాగానే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఏకంగా 18 మంది హీరోలు నటించారు. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇంతమంది హీరోలు నటించారు. దర్శకుడు శంకర్ నుంచి వచ్చిన బెటర్ సినిమా ఈ సినిమా అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.
సినిమాలో దానిమ్మ పళ్లకు సంబంధించిన ఒక సీన్ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. కొన్ని సన్నివేశాలు వావ్ ఫ్యాక్టర్ తో ఉన్నాయి. సింపుల్ ట్విస్ట్ లతోనే ఫ్లాష్ బ్యాక్ ను ముగించారు. సినిమాలో ఇంట్రడక్షన్ సీన్ లో ఫ్లై ఓవర్ కూలిపోయిన సీన్ శంకర్ మార్క్ సన్నివేశాలను గుర్తు చేస్తుంది. గేమ్ ఛేంజర్ ఫస్ట్ డే కలెక్షన్లు ఒకింత భారీ స్థాయిలోనే ఉండే అవకాశం అయితే ఉంది. యూట్యూబర్ల నుంచి మాత్రం ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూలు వస్తున్నాయి.