గేమ్ ఛేంజర్ రివ్యూ: 18 మంది హీరోలు నటించారని తెలుసా..ఎవరెవరంటే..?

Divya
డైరెక్టర్ శంకర్ ,రామ్ చరణ్ కాంబినేషన్లు వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది.సుమారుగా 8000 స్క్రీన్ లలో ఈ సినిమా విడుదలైనట్లుగా తెలుస్తోంది. మొదటి షో నుంచే మంచి హిట్టు టాకుతో దూసుకుపోతున్న ఈ సినిమా గురించి చాలా విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇప్పుడు తాజగా ఈ సినిమాలో చాలామంది హీరోలు నటించినట్లు తెలుస్తోంది. వాటి గురించి ఇప్పుడు పూర్తిగా చూద్దాం.

గేమ్ ఛేంజర్ చిత్రంలో రామ్ చరణ్ కూడా కొన్ని విభిన్నమైన పాత్రలలో నటించారు. రామ్ చరణ్ తమ్ముడి పాత్రలో కేరింత సినిమాలో హీరోగా నటించిన విశ్వంత్ కూడా నటించారట. ఇందులో విలన్ గా హీరో ఎస్ఎస్ సూర్య కూడా నటించారు. అలాగే మరొక హీరో నవీన్ చంద్ర కూడా ఇందులో నటించారు. కీలకమైన పాత్రలో అలనాటి హీరో శ్రీకాంత్ కూడా నటించడం జరిగిందట. ఇక నటుడుగా మంచి పేరు సంపాదించిన సముద్రఖని కూడా ఇందులో నటించారట. ఇందులో అలనాటి సీనియర్ నటుడు నరేష్ కూడా నటించారు.

మలయాళ హీరో జయరాం ఈ చిత్రంలో సూర్య సోదరి పాత్రలో కనిపించారు.. అలాగే బలగం సినిమా ద్వారా మంచి పేరు సంపాదించిన హీరో ప్రియదర్శి కూడా ఇందులో కొన్ని సన్నివేశాలు కనిపించారట.గతంలో కమెడియన్ గా ఎన్నో చిత్రాలలో నటించిన సునీల్ కూడా హీరోగా మారారు. ఇందులో సునీల్ కూడా నటించారు. అలాగే విలేజ్లో వినాయకుడు అనే సినిమా ద్వారా హీరోగా మారిన కృష్ణుడు కూడా ఇందులో నటించారట. వీరితోపాటు అజయ్ గోష్ కూడా నటించారు. సుందరం మాస్టర్ తో హీరోగా పేరుపొందిన వైవాహర్ష , అలాగే హీరో చైతన్య కృష్ణ ఇందులో నటించారు. కమెడియన్ సత్యాతో పాటుగా వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, పృథ్వి వంటి నటీనటులు కూడా ఇందులో నటించారట. ఈ లెక్కన చూస్తే ఈ సినిమాలో సుమారుగా 18 మందికి పైగా హీరోలు నటించినట్లు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: