ఏ హీరోలో లేని ఆ టాలెంట్ కేవలం రామ్ చరణ్ లోనే.. గేమ్ చేంజర్ లో శంకర్ బాగా వాడేశాడుగా..!
దానికి కారణం రీసెంట్గా ఆయన నటించిన "గేమ్ చేంజర్" సినిమా థియేటర్స్ లో రిలీజ్ కావడమే . కొద్దిసేపటి క్రితమే థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన "గేమ్ చేంజర్" సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ అందుకుంది . రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ కి 100కు 100% మార్కులు పడిపోయాయి. ఈ సినిమా మొత్తానికి హైలెట్ క్యారెక్టర్ రామ్ చరణ్ అంటూ పొగిడేస్తున్నారు జనాలు. అంతేకాదు ఈ సినిమాలో కర్త - కర్మ - క్రియ అంతా కూడా రామ్ చరణ్ నే అంటున్నారు .
అయితే ఇలాంటి మూమెంట్లోనే మెగా ఫాన్స్ రాంచరణ్ ని పొగిడేస్తున్నారు. కొందరు హీరోస్ కొన్ని క్యారెక్టర్లకి మాత్రమే సెట్ అవుతారు అని .. అయితే రామ్ చరణ్ మాత్రం అన్ని క్యారెక్టర్స్ కి సెట్ అవుతాడు అని.. ట్రెడిషనల్ ఇటు మాస్ .. మరోకపక్క సెంటిమెంట్ .. ఇంకోసారి లవర్ బాయ్ అన్ని క్యారెక్టర్స్ లో నటించి మెప్పించగలడు అని చెప్పుకొస్తున్నారు . కాగా ఈ గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ లోని కొత్త యాంగిల్ సైతం బయటపెట్టింది అంటూ పొగిడేస్తున్నారు. దీంతో రామ్ చరణ్ పేరు సోషల్ మీడియా వ్యాప్తంగా మారుమ్రోగిపోతుంది. సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు నెంబర్ వన్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అంటూ పొగడతలతో ముంచెత్తుతున్నారు.