"గేమ్ చేంజర్" సినిమా తప్పక థియేటర్లో చూడడానికి ఐదు కారణాలు ఇవే.. డోంట్ మిస్..!
*మొదటగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలాకాలం తర్వాత తెరపై కనిపించాడు. మెగా ఫ్యాన్సే కాదు ఆయనను అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు థియేటర్లో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ చూస్తేనే కిక్ వస్తుంది.
*అంతేకాదు ఈ సినిమాలో రామ్ చరణ్ ఫైట్ సీన్స్ కూడా బాగున్నాయి .. అవి చిన్న స్క్రీన్ పై అయితే పెద్దగా ఆకట్టుకోవు ..పెద్ద స్క్రీన్ పై చూస్తేనే కళ్ళకు ఇంపుగా ఉంటుంది.
* మరీ ముఖ్యంగా మంచి మంచి సీన్స్ ఈ సినిమాలో చాలా ఉన్నాయి . అలాంటి సీన్స్ సెంటిమెంట్ - ఎమోషనల్ కి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. అలాంటి మ్యూజిక్ అలాంటి డిటిఎస్ సౌండ్ లో వింటేనే బాగా ఎంజాయ్ చేయొచ్చు.
*అంతేకాదు ఈ సినిమాలో పాటల లొకేషన్స్ చాలా హైలెట్ గా ఉన్నాయి. శంకర్ ఆ విషయంలో ఎప్పుడు నెంబర్ వన్ అనే విషయాన్ని హైలెట్ చేస్తూ.. చిన్న స్క్రీన్ పై అయితే లొకేషన్స్ అంతగా చూడడానికి ఆకట్టుకోవని ..పెద్ద స్క్రీన్ పై అయితే చాలా ఆహ్లాదకరంగా ఆకట్టుకుంటాయని అంటున్నారు .
*మరి ముఖ్యంగా ఇంట్లో ఒకరో ఇద్దరో కూర్చొని సినిమా చూడడం కన్నా వందలాదిమంది జనాలు మధ్య కూర్చొని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా చూస్తే "అబ్బా సినిమా అంటే ఇదేరా" అన్న ఫీలింగ్ కూడా కలుగుతుంది అంటూ మెగా ఫాన్స్ గేమ్ చేంజర్ కి సపోర్ట్ చేస్తున్నారు.
మరెందుకు ఆలస్యం మీ దగ్గరలోని థియేటర్లో టికెట్ బుక్ చేసుకుని మరి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి అంటూ సలహా ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో గేమ్ చేంజర్ సినిమా రివ్యూ బాగా హాట్ టాపిక్ గా వైరల్ అవుతుంది. మొత్తానికి రామ్ చరణ్ కూసింత గట్టిగానే మంచి హిట్ కొట్టాడు అంటున్నారు సినీ ప్రముఖులు..!