గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలు.. సీఎం రేవంత్ పై కేఏ పాల్ ఫైర్

MADDIBOINA AJAY KUMAR
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై, ప్ర‌జా శాంతి పార్టీ అధ్య‌క్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల ఐకన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లో జరిగిన ఘటన గురించి అందరికి తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఇకనుంచి బెనిఫిట్ షోలు, అద‌న‌పు షోలు, టికెట్ల పెంపుద‌లకు పర్మిషన్ ఇవ్వమని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.
ఇదిలా ఉండగా మెగా హీరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా నేడు రిలీజ్ అయ్యింది. ఈ సినిమా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించారు. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. నేడు విడుదల అయిన గేమ్ చేంజర్ మూవీకి బెనిఫిట్, అద‌న‌పు షోలకు పర్మిషన్ ఇచ్చారు. అలాగే టికెట్ల పెంపుద‌ల కూడా పెంచారు.
దీంతో కేఏ పాల్, సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి హైడ్రామా మొదలుపెట్టరాని మండిపడ్డారు. మొన్నే బెనిఫిట్ షోలు వద్దని.. ఇప్పుడు అన్నింటికీ పర్మిషన్ ఇవ్వడం ఏంటని విమర్శించారు.   ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే బెనిఫిట్ షోలను రద్దు చేయలని అన్నారు. నీకు రూ.100 కోట్లు, రూ. 1000 కోట్లు డీల్ ఇచ్చారా అని కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక రెడ్డి అయిన దిల్ రాజు వచ్చి మరో రెడ్డి అయిన రేవంత్ రెడ్డికి చెప్తే డీల్స్ చేసుకుంటారా అని మండిపడ్డారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా తో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: