"గేమ్ చేంజర్" కాదు "మెగా చేంజర్".. ఇకపై ఎవరూ రాంచరణ్ ని అలా ఊహించుకోలేరు.. ఎందుకంటే..?
కానీ గేమ్ చేంజర్ తో అది మొత్తం టర్న్ అయిపోయింది. "గేమ్స్ చేంజర్" సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా "అప్పన్న" క్యారెక్టర్ లో రామ్ చరణ్ నటన పర్ఫామెన్స్ ను హైలెట్ చేస్తున్నారు. అసలు అప్పన్న క్యారెక్టర్ కి రామ్ చరణ్ తప్పిస్తే మిగతా ఏ టాలీవుడ్ స్టార్ కూడా సూట్ అవ్వడు అని .. రామ్ చరణ్ ఆ విధంగా నటించాడు అని.. రామ్ చరణ్ అప్పన్న పాత్రలో అదరహో అంటూ బాగా ఓరేంజ్ లో ప్రశంసిం చేస్తున్నారు . అంతేకాదు మెగా ఫాన్స్ అయితే ఇక రామ్ చరణ్ ని నాటి పాత్రలో మనం ఊహించుకోలేమని "అప్పన్న" క్యారెక్టర్ లో అంతా అచ్చు గుద్దినట్లు నటించి జీవించేసాడు అని ..
ఇది నిజంగా రియల్ క్యారెక్టర్ గానే ఉంది అంటూ శంకర్ డైరెక్షన్ ని కూడా పోగిడేస్తున్నారు . అయితే సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా డైరెక్టర్ శంకర్ ..ప్రొడ్యూసర్ దిల్ రాజు.. హీరోయిన్స్ అంజలి - కియరా అద్వానీ పేర్ల కన్నా కూడా రామ్ చరణ్ పేరున ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది అని .. బహుశా నెక్స్ట్ రాంచరణ్ తన సినిమాలో ఈ విధంగా నటించలేడు ఏమో అంటూ కూడా మాట్లాడుతున్నారు. దీంతో గేమ్ చేంజర్ సినిమా రివ్యూ హాట్ టాపిక్ గా మారింది. అంతేకాదు ఈ సినిమా మొదటి రోజే 250 కోట్లు ఈజీగా దాటేస్తుంది అంటూ చెప్పుకు వస్తున్నారు. చూద్దాం మరి గేమ్ చేంజర్ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో..? రామ్ చరణ్ ని ఇండస్ట్రీలో ఏ స్థాయిలో నిలబెడుతుందో..??