ఒకరికి హగ్.. ఒకరికి కిస్.. హీరోయిన్ నిత్య మీనన్ పై తీవ్ర విమర్శలు?

praveen
కేరళ కుట్టి, నటి నిత్య మీనన్ గురించి తెలుగు వాళ్లకు కూడా బాగా తెలుసు. "అలా మొదలైంది" సినిమాతో తెలుగు సినిమా జర్నీ మొదలు పెట్టిన ఈ మలయాళ ముద్దుగుమ్మ, చేసిన మొదటి సినిమాతోనే మంచి పేరు దక్కించుకుంది. ఈ సినిమా తరువాత నిత్య ఇక వెనక్కి తిరిగి చూసుకువలసిన అవసరం లేకుండా పోయింది. ఈ క్రమంలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించడమే కాకుండా, విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకొని ఏకంగా నేషనల్ అవార్డు కూడా దక్కించుకుంది.
కేవలం తెలుగులోనే కాదు కన్నడ, మలయాళం, తమిళ సినిమాలతో సైతం నిత్య ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇక మేటర్లోకి వెళితే... నిత్యా మేనన్ చాలా గ్యాప్ తర్వాత ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. జయం రవి కథానాయకుడిగా తెరకెక్కిన ‘కాదలిక్క నేరమిల్లై’ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించింది. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ ఈ సినిమాకు నిర్మాత కావడం విశేషం. అనేటికాదండోయ్... ఆయన సతీమణి కిరుతిగ ఉదయనిధి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం కొసమెరుపు. దర్శకురాలిగా ఆమెకు ఇది 3వ సినిమా కావడం విశేషం.
ఈ సినిమాలో జయం రవి, నిత్యతో పాటు వినయ్, యోగి బాబు, లాల్, లక్ష్మీ రామకృష్ణన్, వినోదిని, గాయకుడు మనో, టీజే బాను, జాన్ కోగన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించడం విషీహం. రెడ్ జెయింట్ మూవీస్ నిర్మించనున్న ఈ చిత్రానికి ఏఆర్ రఘుమాన్ సంగీతం అందించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను జనవరి 7న విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది. కాగా ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్రబృందం సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రమోషన్ కార్యక్రమంలో నిత్ ప్రవర్తించిన తీరు అందరినీ షాకింగ్ కు గురి చేసింది.
అవును... మీడియా పాయింట్ దగ్గరికి నిత్యా మీనన్‌‌ని ఆహ్వానించిన ఓ రిపోర్టర్, ఆమెకి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ట్రై చేసాడు. అయితే నిత్య అతనికి షేక్ హ్యాండ్ నిరాకరించింది. ఈ నేపథ్యంలోనే ‘నా గొంతు సరిగ్గా లేదు. కోవిడ్ మళ్లీ వస్తుందని అంటున్నారు..’ అంటూ నవ్వుతూ షేక్ హ్యాండ్ అవాయిడ్ చేసింది. దీనికి రిపోర్టర్ కూడా ఏ మాత్రం నొచ్చుకోకుండా మైక్‌ని సరి చేసి పక్కకెళ్లి నిల్చున్నాడు. అయితే ఇదే ప్రమోషన్ ఈవెంట్ లో నిత్యా మీనన్ దర్శకుడు మిష్కిన్‌ను పెట్టుకోవడం, జయం రవిని కొగిలించుకోవడం జరిగింది. దాంతో అభిమానంతో జస్ట్ షేక్ హ్యాండ్ అడిగిన రిపోర్టర్ తో నిత్య ప్రవర్తించిన తీరు ఏ మాత్రం బాగోలేదంటున్నారు అని నెటిజనం అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: