గజిని మూవీని ఎంతమంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా..?

Pulgam Srinivas
తమిళ నటుడు సూర్య హీరోగా ఆసిన్ , నయనతార హీరోయిన్లుగా ఏ ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కొన్ని సంవత్సరాలు క్రితం గజిని అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా తమిళ్ , తెలుగు భాషల్లో రూపొంది అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఇదే సినిమాను మురగదాస్ ఆ తర్వాత హిందీ లో అమీర్ ఖాన్ హీరోగా రీమిక్ చేశాడు. ఈ మూవీ హిందీ బాక్సా ఫీస్ దగ్గర కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.


ఇకపోతే మురుగదాస్ ఈ సినిమాను సూర్యతో కాకుండా వేరే హీరోలతో చేద్దాము అని అనేక ప్రయత్నాలను చేసినా కూడా ఈ సినిమా కథను విన్న అనేక మంది హీరోలు ఈ సినిమా కథను రిజెక్ట్ చేశారట. అందులో భాగంగా ఈ సినిమా కథను ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు కూడా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ విషయాలు ఏమిటో తెలుసుకుందాం. ఈ మూవీ కథను మొదటగా ఏ ఆర్ మొరగదాస్ టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వినిపించాడట. కథ మొత్తం విన్న ఆయన కథ సూపర్ గానే ఉంది కానీ నాపై ఈ సినిమా వర్కౌట్ కాదు అని ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. దానితో మురుగదాస్ ఈ సినిమా కథను సూపర్ స్టార్ మహేష్ బాబుకు వినిపించాడట.


కథ మొత్తం విన్న మహేష్ బాబు సినిమా స్టోరీ సూపర్ గా ఉంది. కానీ ఈ స్టోరీ నాపై అస్సలు సెట్ కాదు అనే కారణంతో ఈ మూవీ ని రిజెక్ట్ చేశాడట. దానితో ఈయన ఆ తర్వాత సూర్యను కలిసి ఈ మూవీ కథను వివరించగా ఆయనకు ఈ కథ సూపర్ గా నచ్చడంతో వెంటనే ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దానితో గజినీ అనే టైటిల్ తో ఈ మూవీ ని మురగదాస్ రూపొందించాడట. ఇక ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఈ మూవీ తో సూర్య క్రేజ్ ఒక్క సారిగా పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: