హీరోయిన్ పై అస‌భ్య‌క‌ర కామెంట్స్.. డైరెక్ట‌ర్ పై మ‌హిళా క‌మిష‌న్ ఫైర్

frame హీరోయిన్ పై అస‌భ్య‌క‌ర కామెంట్స్.. డైరెక్ట‌ర్ పై మ‌హిళా క‌మిష‌న్ ఫైర్

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినిమా దర్శకుడు, రచయిత, నిర్మాతయిన త్రినాధరావు నక్కినపై పరిచయం అవసరం లేదు. ఇక తాజాగా  డైరెక్టర్ త్రినాధరావు మాట్లాడిన మాటలు మంచివి కాదని.. చూస్తూ ఉండలేమని తెలంగాణ మహిళా కమిషన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. త్వరలోనే ఆయనకు నోటీసు జారీ చేస్తామని చైర్ పర్సన్ నేరేళ్ల శారద స్పష్టం చేసింది.

ఈయన సినిమా చూపిస్త మామ, నేను లోకల్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. త్రినాధరావుకు చిన్ననాటి నుండి కథను ఆసక్తిగా చెప్పగలిగే ఒక కళ ఉంది. ఆయన ఉద్యోగం కోసం హైదరాబాదు వెళ్ళాడు. సినిమా దర్శకుడిగా మారడానికి ముందు ఈయన ఈటీవీ కోసం కొన్ని సీరియల్స్ కూడా చేశాడు. త్రినాధరావు, 2012లో మేం వయసుకు వచ్చాం సినిమాకు తొలిసారిగా దర్శకత్వం వహించాడు. ఈ తరువాత కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించడంతోపాటు, మరికొన్ని సినిమాలకు రచయితగా పనిచేశాడు.
తాజాగా ఈయన స్టార్ హీరోయిన్ అన్షు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సందీప్ కిషన్ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మజాకా అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా కు సంబంధించిన టీర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత హీరోయిన్ అన్షు మళ్లీ నటిస్తున్నారని తెలిపారు. ఆమె కొంచెం సన్నబడిందని అన్నారు. అందుకే తిని పెంచమ్మా అని ఆయన తెలిపారు. తెలుగుకు ఇది సరిపోదని ఆయన అన్నారు. అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని త్రినాధ రావు చెప్పుకొచ్చారు. ఆ మాటలకి హీరోయిన్ అన్షు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఇటీవల హీరోయిన్లను నోటికొచ్చినట్లు మాట్లాడటమేంటని డైరెక్టర్ త్రినాధరావుపై నెటిజన్లు మండిపడ్డారు. అలాగే ఇలాంటి వాళ్లను బ్యాన్ చేయాలంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ కేసు ఎలాంటి మలుపు తీరుగుతోందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: