అమీర్ ఖాన్ మూవీలో ప్రభాస్ కీలక పాత్ర..?

frame అమీర్ ఖాన్ మూవీలో ప్రభాస్ కీలక పాత్ర..?

Veldandi Saikiran
ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తనదైన నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఎప్పటికప్పుడు వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ అభిమానులతో చేరువలో ఉంటాడు. కాగా, చాలా సంవత్సరాల నుంచి ప్రభాస్ సంవత్సరానికి కేవలం ఒక సినిమాను మాత్రమే చేస్తున్నారు. అయితే 2023లో మాత్రం ప్రభాస్ అందరికీ ఆశ్చర్యాన్ని ఇచ్చేలా రెండు సినిమాలు చేశారు. ఆ తర్వాత 2024లో ప్రభాస్ నటించిన కల్కి 2898ఏడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఇక 2025 లోనూ ప్రభాస్ రెండు సినిమాలు విడుదల అవుతాయని అభిమానులు ఎంతగానో ఆశలు పెట్టుకుంటున్నారు. దానికి తగినట్లుగానే డార్లింగ్ ప్రభాస్ తదుపరి సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. కల్కి సినిమా అనంతరం ప్రభాస్ నటించిన హార్రర్, రొమాంటిక్, కామెడీ చిత్రం ది రాజా సాబ్. ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. చిత్ర బృందం స్వయంగా ఈ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. అదే రోజున ఇతర హీరోల సినిమాలు ఉన్న కారణంగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇది ఇలా ఉండగా.... అమీర్ ఖాన్ కొత్త సినిమాలో ప్రభాస్ గెస్ట్ అప్పీరెన్స్ రోల్ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ అమీర్ ఖాన్ ఎవరితో సినిమా చేస్తున్నాడనే విషయం మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు అమీర్ ఖాన్, ప్రభాస్ కి మధ్య మంచి బాండింగ్ ఉండడంతో ప్రభాస్ గెస్ట్ రోల్ చేయబోతున్నారట.
 వీరిద్దరూ కలిసి చాలా సార్లు బయట కూడా కలుసుకుంటారనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు అమీర్ ఖాన్ సినిమాలో ప్రభాస్ నటిస్తే మంచి క్రేజ్ ఉంటుందని ఉద్దేశంతోనే డైరెక్టర్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా కూడా అమీర్ ఖాన్ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ నటిస్తుండడం చాలా గొప్ప విషయం అని చెప్పాలి. మరి ఈ సినిమా ఎప్పుడు తెరపైకి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: