గేమ్ ఛేంజర్ కు బ్రహ్మరధం పడ్తున్న ప్రేక్షకులు...ఎక్కడో తెలుసా.?

frame గేమ్ ఛేంజర్ కు బ్రహ్మరధం పడ్తున్న ప్రేక్షకులు...ఎక్కడో తెలుసా.?

FARMANULLA SHAIK
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌తో చేసిన చిత్రమే గేమ్ ఛేంజర్ . సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ మధ్య దుమ్మురేపుతోంది. ఫస్ట్ డే ఏకంగా రూ.186 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టిన గేమ్ ఛేంజర్ తన ఊపును అలాగే కంటిన్యూ చేసిందా? మూడో రోజు ఎలాంటి వసూళ్లు రాబట్టిందో చూస్తే నైజాంలో రూ. 43 కోట్ల బిజినెస్, ఆంధ్రాలో రూ.75 కోట్లు , సీడెడ్‌లో 25 కోట్ల చొప్పున మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే 145 కోట్ల రూపాయల బిజినెస్‌ చేసింది గేమ్ ఛేంజర్. తద్వారా 150 కోట్ల రూపాయల షేర్, 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా నిర్దేశించారు ట్రేడ్ పండితులు. స్పెషల్ షోలు, అడ్వాన్స్ బుకింగ్ కారణంగా గేమ్ ఛేంజర్ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్లు, రాబట్టగా రెండో రోజు భారీ డ్రాప్స్ అందుకుని రూ. 28 కోట్ల వసూళ్లు సాధించింది.ఇక మూడో రోజు వసూళ్ల విషయానికి వస్తే.. గేమ్ ఛేంజర్ విడుదలైన రెండ్రోజుల గ్యాప్‌లో నందమూరి బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ రిలీజైంది. కొన్ని ఏరియాల్లో చరణ్ మూవీపై బాలయ్య సినిమా ఇంపాక్ట్ చూపుతోందని అంటున్నారు విశ్లేషకులు. మిక్స్‌డ్ టాక్, నెగిటివిటీ వస్తున్నా రామ్ చరణ్ తన దమ్ము చూపిస్తున్నాడు.

తెలుగులో వసూళ్లు డ్రాప్ అవుతుండగా.. హిందీలో మాత్రం అంతకంతకూ పెరుగుతుండటం చిత్ర యూనిట్‌కు ఊరట కలిగిస్తోంది.ఇప్పుడు మాత్రం 'గేమ్ ఛేంజర్' కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తోంది. అదికూడా నార్త్ నుంచి కావడం విశేషం. నార్త్ లో 'గేమ్ ఛేంజర్' సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. సినిమా చాలా బాగుందని, ముఖ్యంగా రామ్ చరణ్ పెర్ఫెర్మాన్స్ నెక్స్ట్ లెవెల్, శంకర్ డైరెక్క్షన్, విజువల్స్, సాంగ్స్.. అన్నీ సూపర్ అని, ఫైనల్ గా టైటిట్ కు తగ్గట్లే సినిమా ఉందంటూ అక్కడి ఆడియన్స్ చెబుతున్నారు.ఇదే విషయాన్ని దిల్ రాజు టీమ్ వీడియోతో సహా బయటపెట్టింది. 'గేమ్ ఛేంజర్' నార్త్ ఆడియన్స్ పబ్లిక్ టాక్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన మూవీ టీమ్..' 'గేమ్ ఛేంజర్' అన్ని బ్యారియర్స్ ను బ్రేక్ చేసుకుంటూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తుంది..' అంటూ పేర్కొన్నారు. మరి నార్త్ వాళ్లకు నచ్చిన 'గేమ్ ఛేంజర్' మన తెలుగు వాళ్లకు నచ్చక పోవడం గమనార్గం.వీటికి తోడు హిందీలో పుష్ప 2 హవా ఇంకా తగ్గలేదు.. 20 నిమిషాల అదనపు ఫుటేజ్‌ను యాడ్ చేయడంతో అల్లు అర్జున్ మరింత బలం పుంజుకున్నాడు. మరి ఈ టఫ్ ఫైట్‌లో గేమ్ ఛేంజర్ ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: