నిన్ను అలా చూడలేం బాబోయ్..?
అనసూయ ఎప్పటికప్పుడు వరుస పెట్టి సినిమాలలో నటిస్తూ అభిమానులకు చేరువలో ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా అనసూయ సినిమాల మీద ఉన్న ఆసక్తితో షోలకు పూర్తిగా వీడ్కోలు పలికింది. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ షోలలో జడ్జిగా వ్యవహరిస్తోంది. రీసెంట్ గా అనసూయ పుష్ప-2 సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. కాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటుంది. వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. తన అందాలను ఆరబోస్తూ అభిమానులకు కనువిందు చేస్తుంది.
అంతేకాకుండా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా అనసూయ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అందులో అనసూయ మేకప్ లేకుండా ఉన్న ఫోటోను షేర్ చేసుకుంది.
ఈ ఫోటోను చూసిన చాలామంది అనసూయ మేకప్ లేకుండా చాలా చండాలంగా ఉన్నావ్ అంటూ నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. మేకప్ వేసుకుంటేనే నిన్ను చూడగలము మేకప్ లేకుంటే నిన్ను అస్సలు చూడలేము అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫోటోలు కాస్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో నెటిజన్స్ అనసూయ ఫోటోలపై ట్రోల్ చేస్తున్నారు. కాగా అనసూయ ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ ఏమాత్రం తీసిపోకుండా తన అందచందాలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. వయసు పెరిగినప్పటికీ అదే అందం, ఫిట్నెస్ కొనసాగిస్తోంది.