బాలయ్య బ్యూటీ ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ కావాల్సిందే.. మరి ఇన్ని కోట్లా..?

frame బాలయ్య బ్యూటీ ఆస్తుల వివరాలు తెలిస్తే షాక్ కావాల్సిందే.. మరి ఇన్ని కోట్లా..?

Pulgam Srinivas
తమిళ సినిమాల ద్వారా కెరియర్ ను మొదలు పెట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీలలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ప్రగ్యా జైస్వాల్ 2014 వ సంవత్సరం విరుట్టు అనే తమిళ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అయింది. ఇక ఆ తర్వాత ఈమె 2015 వ సంవత్సరం అభిజిత్ హీరోగా రూపొందిన మిర్చి లాంటి కుర్రాడు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయం సాధించలేదు. దానితో ఈమెకు మంచి గుర్తింపు కూడా తెలుగు సినిమా పరిశ్రమలో దక్కలేదు.

ఆ తర్వాత ఈమె తెలుగులో కంచె అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం , ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు ఈ సినిమా ద్వారా వచ్చింది. ఇకపోతే ఈమె చాలా సినిమాల్లో నటించిన బాలయ్య సినిమాల ద్వారా ఈమెకు బ్లాక్ బాస్టర్ విజయాలు దక్కాయి. కొంత కాలం క్రితం బాలయ్య హీరోగా రూపొందిన అఖండ సినిమాలో ఈమె హీరోయిన్గా నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అయింది. ఇక తాజాగా ఈ బ్యూటీ బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ సినిమాలో కూడా నటించింది. నిన్న అనగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది.

ఇకపోతే ఈ ముద్దు గుమ్మ పెద్ద మొత్తంలో ఆస్తులను కూడా పెట్టినట్లు తెలుస్తుంది. అసలు విషయం లోకి వెళితే ... ప్రగ్యా జైస్వాల్ ఒక్కో సంవత్సరానికి దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలను యూట్యూబ్ ద్వారానే సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈమె మొత్తంగా ఇప్పటి వరకు 50 కోట్ల ఆస్తులను సంపాదించినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇలా ప్రగ్యా జైస్వాల్ పెద్ద మొత్తం లోనే ఆస్తులను కూడబేట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: