బాబీ దర్శకత్వంలో తాజాగా విడుదలైన డాకు మహారాజ్ మూవీ బాలకృష్ణకి ఎంత మంచి హిట్ ఇచ్చిందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా కొంతమంది యావరేజ్ అంటే మరి కొంతమంది ఏమో బ్లాక్ బస్టర్ అంటున్నారు. అయితే చాలా రోజుల తర్వాత బాలకృష్ణని ఈ రేంజ్ లో చూశారు నందమూరి అభిమానులు. ఇక వీర సింహారెడ్డి తర్వాత వచ్చిన భగవంత్ కేసరి సినిమా హిట్ అయినప్పటికీ నందమూరి ఫ్యాన్స్ అనుకున్న రేంజ్ లో బాలకృష్ణ డైలాగులు యాక్షన్ సీన్స్ లేవు. కానీ బాలకృష్ణ ఫ్యాన్స్ ఆయన నుండి ఏవి ఆశిస్తారో అవన్నీ డాకు మహారాజ్ సినిమా ద్వారా నెరవేరాయి.అలా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ హిట్ తో బాలకృష్ణ డైరెక్టర్ నిర్మాత మాత్రమే కాదు హీరోయిన్స్ కి కూడా బంపర్ ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. ఇక ఈ మూవీలో ప్రగ్యా జైస్వాల్,శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటేలాలు నటించారు.
ఇందులో నటించిన శ్రద్ధా శ్రీనాథ్ కి తాజాగా బంపర్ ఆఫర్ తగిలినట్టు కోలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఏకంగా స్టార్ హీరో సరసన పాన్ ఇండియా మూవీలో అవకాశం వచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. మరి ఇంతకీ శ్రద్ధా శ్రీనాథ్ కి వచ్చిన అవకాశం ఏంటయ్యా అంటే..రజినీకాంత్ హీరోగా జైలర్ సీక్వెల్ జైలర్ టు మూవీలో శ్రద్ధా శ్రీనాథ్ కి కీలక పాత్ర ఇచ్చినట్టు కోలీవుడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే శ్రద్ధా శ్రీనాథ్ కి బంపర్ ఆఫర్ వచ్చినట్టే. రజినీకాంత్ సినిమాలో ఛాన్స్.. అది కూడా జైలర్ వంటి భారీ హిట్ కి సీక్వెల్లో నటించడం అంటే తక్కువేమీ కాదు. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో కళానిధి మారన్ నిర్మించిన జైలర్ మూవీ 2023లో వచ్చి భారీ హిట్ కొట్టింది.
అయితే దీనికి సీక్రవెల్ కూడా ఉంటుంది అని ప్రకటించారు. అలాగే కూలి సినిమా తర్వాత రజినీకాంత్ జైలర్ -2 మూవీలో నటించబోతున్నట్టు తెలుస్తోంది.తాజాగా జైలర్ -2 సంబంధించిన చిన్న వీడియో రిలీజ్ చేసి జైలర్ టు పై భారీ హోప్స్ పెంచేశారు. అంతేకాదు కోలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి 1000 కోట్ల సినిమా జైలర్-2 అవుతుంది అని అంచనాలు పెంచేస్తున్నారు.అయితే అలాంటి పాన్ ఇండియా సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కి అవకాశాలు రావడం ఆమె ఫ్యాన్స్ కి సంతోషాన్నిస్తుంది.