షాక్:గేమ్ ఛేంజర్ సినిమా పై..45 మంది కుట్ర.. విస్తు పోయే నిజాలు..!
అయితే మరొక విశేషం ఏమిటంటే విడుదలకు ముందే నిర్మాతలతో పాటుగా చిత్ర బృందంలోని కొంతమంది కీలకమైన వ్యక్తులు సోషల్ మీడియా అలాగే వాట్సాప్ లలో కూడా బెదిరింపులు వచ్చాయట.. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే కచ్చితంగా లీక్ చేస్తామంటూ చాలామంది బెదిరింపులకు దిగారట. అయినా కూడా వీరు లొంగక పోవడంతో సినిమాకి సంబంధించి కొన్ని ట్విస్టులను సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఆ ముఠా షేర్ చేసిందట. సినిమా రిలీజ్ అయిన తర్వాత.. గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించి హెచ్డి ప్రింట్ ని లీవ్ చేయడమే కాకుండా టెలిగ్రామ్ సోషల్ మీడియాలో అందరికీ కూడా షేర్ చేస్తూ ఉన్నారట.
దీంతో ఆ 45 మంది పైన ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ ఇచ్చిందట చిత్ర బృందం.. అంతేకాకుండా ఆ ముఠా గేమ్ ఛేంజర్ చిత్రానికి సంబంధించి నెగటివ్ కూడా స్ప్రెడ్ చేశారట.. ఇక పోలీసులు వీరు కావాలని ప్రింటుని లీక్ చేశారా? లేకపోతే వీరు వెనక ఎవరిదైనా హస్తం ఉందా అనే విషయం తెలియాల్సి ఉన్నది. ప్రస్తుతం సైబర్ క్రైమ్ వీరి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ని కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. మరి మొత్తానికి ఈ విషయం పైన అటు పోలీసులు ఎలాంటి విషయాన్ని చెబుతారు అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు