సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ: వెంకీ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించారా.. ట్విట్ రివ్యూ..!

frame సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ: వెంకీ ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించారా.. ట్విట్ రివ్యూ..!

Divya
హీరో వెంకటేష్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన మొట్టమొదటి చిత్రం సంక్రాంతికి వస్తున్నాం.. ఈ సినిమా ఈ రోజున భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. ఇప్పటికే ఈ సినిమా పైన ట్రైలర్, టీజర్ తో పాటలతో మంచి హైపర్ ఏర్పడింది. ముఖ్యంగా ఇందులో కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తోంది. మరి ఈ రోజున విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా టాక్ ఎలా ఉందో ఇప్పుడు ట్విట్టర్ ద్వారా పలువురు నెటిజెన్స్ తెలియజేశారు వాటి గురించి చూద్దాం.

ఇప్పటికే సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్ , డాకు మహారాజ్ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఈ రోజున సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల అవ్వగా ఈ సినిమాకి కూడా పాజిటివ్ బజ్ ఏర్పడింది.144 నిమిషాల నిడివితో ఈ సినిమా ప్రారంభమవుతుందట ఇందులో మీనాక్షి చౌదరి, గణేషన్, నరేష్ పాత్రలు వెంకటేష్ ఎంట్రీ ఈ సినిమాకి హైలైట్ గా ఉన్నాయట. అలాగే మరొక హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా మారిపోతుందట. ఫస్టాఫ్ అంతా కూడా డైరెక్టర్ అనిల్ రావిపూడి కామెడీ సన్నివేశాలతో సినిమాని నెట్టుకొచ్చారు.

స్టోర్ విషయానికి వస్తే ఇందులో వైడి రాజు(వెంకటేష్) నటించారు ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించడం జరిగింది. గోదావరి జిల్లాలో తన కుటుంబంతో కలిసి నివసిస్తున్న వైడిరాజును ఒక పని కోసం మళ్లీ అతడిని పిలిపిస్తారు..?  ఈ చిత్రంలో ఇది మెయిన్ పాయింట్ అన్నట్టుగా చూపించారు డైరెక్టర్. అయితే ఇందులో కొన్ని కామెడీ సన్నివేశాలు భారీగా వర్కౌట్ అయిన కొన్ని ఇరిటేషన్ తెప్పించేలా కూడా ఉంటాయట. మొదటి భాగం అంత హైలెట్గా నిలిచిందని ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి, వెంకటేష్ మధ్య జరిగే సన్నివేశాలు కూడా అందరిని ఆకట్టుకుంటాయని తెలుపుతున్నారు. సెకండాఫ్ ఒక మోస్తారులో ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఉందని ఓవరాల్గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుందని టాక్ వినిపిస్తోంది. మరి పూర్తి రివ్యూ తెలియాలి అంటే మరి కొన్ని గంటలు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: