సంక్రాంతికి సరైన మూవీ దింపిన అనిల్ రావిపూడి..మళ్ళీ వెంకీ మామే నెగ్గాడుగా..!!

frame సంక్రాంతికి సరైన మూవీ దింపిన అనిల్ రావిపూడి..మళ్ళీ వెంకీ మామే నెగ్గాడుగా..!!

murali krishna
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. రైటర్ గా కెరీర్ ప్రారంభించిన అనిల్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు.. డైరెక్టర్ గా కల్యాణ్ రాం ఇచ్చిన అవకాశాన్ని చక్కగా వాడుకొని “పటాస్” వంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు.. ఈ సినిమా అనిల్ కెరీర్ నే టర్న్ చేసింది.. ఆ తరువాత దిల్ రాజు బ్యానర్ లో చేసిన సుప్రీం కూడా సూపర్ హిట్ కావడంతో దిల్ రాజు బ్యానర్ ఆస్థాన దర్శకుడిగా అనిల్ మారిపోయారు..ఈ రెండు సినిమాల తరువాత అనిల్ చేసిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయింది.. అనిల్ తన కెరీర్ లో   వెంకటేష్, రవితేజ, మహేష్, బాలయ్య వంటి స్టార్స్ తో సినిమాలు చేసి సూపర్ హిట్స్ అందించాడు.. తాజాగా తన లక్కీ హీరో వెంకటేష్ తో “ సంక్రాంతికి వస్తున్నాం “.. అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమాకి కూడా దిల్ రాజే ప్రొడ్యూసర్ కావడం విశేషం.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా నేడు (జనవరి 14 ) న ఈ సినిమా రిలీజ్ అయింది.. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ మాజీ లవర్ గా మీనాక్షి చౌదరి నటించారు.. ఈ సినిమాలో వెంకీ మామ మాజీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు.. నేడు గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ బిగ్గెస్ట్ ఫన్టాస్టిక్ మూవీ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది..

ఈ సినిమా చూసిన ప్రేక్షకులు పండుగకి అసలైన మూవీ దించావ్ అంటూ అనిల్ ని తెగ పొగిడేస్తున్నారు..ఈ సినిమా మొదటినుంచి చివరి వరకు కామెడీ ఎంటర్టైనర్ గా ఉండే విధంగా దర్శకుడు అనిల్ రావిపూడి తీర్చిదిద్దాడు. ముందు నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని వచ్చిన ఈ సినిమా సక్సెస్ అయింది..సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఫన్ జనరేట్ చేస్తూ  ప్రేక్షకుల్లో సినిమా మీద ఒక ఎమోషనల్ బాండింగ్ ఏర్పడేలా చేసారు..వెంకటేష్ యాక్టింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ గా నిలుస్తుంది.. ఈ సంక్రాంతికి వచ్చిన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ కంటే ఎక్కువగా వెంకీ మామ సినిమానే ప్రేక్షకులు మొదటి ఆప్షన్ గా ఎంచుకునే అవకాశం.. దీనితో లేటు గా వచ్చిన సరైన సమయానికి వెంకీ మామ వచ్చాడని ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: