సంక్రాంతికి వస్తున్నాం: సినిమాను నిలబెట్టిన ఫస్టాఫ్?

frame సంక్రాంతికి వస్తున్నాం: సినిమాను నిలబెట్టిన ఫస్టాఫ్?

Veldandi Saikiran
సంక్రాంతి పండుగ వచ్చిన నేపథ్యంలో చాలా సినిమాలు ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే గేమ్ చేంజర్ అలాగే డాకు మహారాజు సినిమాలు... రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్నాయి. అయితే ఈ రెండు సినిమాల కంటే విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా.... బంపర్ హిట్ కావడం గ్యారెంటీ అని అందరూ అనుకున్నారు. ఇలాంటి అంచనాల నేపథ్యంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా... ఇవాళ విడుదలైంది.

ఈ నేపథ్యంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి అన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్ లో రివ్యూస్ వస్తున్నాయి. అయితే గేమ్ చేజర్ అలాగే బాలయ్య నటించిన డాకుమహారాజు సినిమా కంటే... అసలు సీసలు సంక్రాంతి సినిమా సంక్రాంతికి వస్తున్నాం అని కామెంట్స్ వినిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మొత్తం కామెడీ ఉందట.

ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు... విక్టరీ వెంకటేష్ కామెడీ అదరగొడతారట. ముఖ్యంగా ఫస్టాఫ్ లో ఉండే కామెడీ చాలా బాగుంటుందని చెబుతున్నారు. కుటుంబ సమేతంగా ఈ సినిమాను చూడవచ్చని చెబుతున్నారు. ఐదుకు ఈ సినిమాకు మూడు మార్కులు వేయచ్చని కూడా అంటున్నారు.

విక్టరీ వెంకటేష్ ఈ సినిమాలో వైడి రాజు పాత్రలో చేయగా... అతని భార్యగా ఐశ్వర్య రాజేష్ చాలా చక్కగా నటించిందట. సినిమా మొత్తం రాజమండ్రి  దగ్గరే తీయడంతో జనాలకు బాగా నచ్చుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా మీనాక్షి చౌదరి ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమాకు హైప్ పెరుగుతుందట. మరి కామెడీ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైన్ కావడంతో... గేమ్ చేoజర్ అలాగే డాకు మహారాజు.. కలెక్షన్స్ తగ్గడం గ్యారెంటీ అంటున్నారు. కాగా ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా చేయగా... హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేష్,   మీనాక్షి చౌదరి  నటించారు. ఇక ఈ సినిమా బలం, దర్శకత్వం అన్ని అనిల్ రావిపూడి అన్న సంగతి తెలిసిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: