సంక్రాంతికి వస్తున్నాం: ప్లస్, మైనస్ పాయింట్స్ ఇవే ?
ఇక ఇవాళ థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాపై రకరకాలుగా స్పందిస్తున్నారు. సినిమా బాగుందని కొందరు అంటే మరి కొంత మంది చెత్తగా ఉందని చెబుతున్నారు. మొత్తానికి విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి హిట్ కొట్టినట్లు అని మరికొందరు అంటున్నారు. ఈ సినిమాలో పాజిటివ్ అలాగే నెగిటివ్ పాయింట్స్ ఒకసారి చూద్దాం.
ఈ సినిమాకు విక్టరీ వెంకటేష్ కామెడీ చాలా ప్లస్ అయింది. అలాగే ఐశ్వర్య రాజేష్ నటన, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. మీనాక్షి చౌదరి ఎంట్రీ అదుర్స్ అని చెప్పవచ్చు. ఇక నెగిటివ్ పాయింట్స్ విషయానికొస్తే... కథలో లాజిక్ లేకపోవడం జరిగింది. ఇంకా పేపర్ వర్క్ చేయాల్సి ఉండేది. బలవంతంగా ఉపేంద్రతో కామెడీ పండించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ అఫ్ బాగుంటే సెకండ్ హాఫ్ దొబ్బింది అని చెప్పవచ్చు.
కథ
ఈ సినిమాలో వైడిరాజు పాత్రలో వెంకటేష్ కనిపించారట. వెంకీ మామ మాజీ కాప్. ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ కూడా కావడం గమనార్హం. ఇక రాజమండ్రి సమీపంలోని ఒక గ్రామంలో తన భార్య (ఐశ్వర్య రాజేష్), ఉమ్మడి కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు వెంకీ. ఆ సమయంలోరు మాజీ గర్ల్‌ఫ్రెండ్ (మీనాక్షి చౌదరి) వెంకీ జీవితంలోకి ఎంట్రీ ఇస్తుంది. మీనాక్షి చౌదరి కూడా ఒక పోలీసే. రహస్య రెస్క్యూ ఆపరేషన్‌లో వెంకటేష్ సాయం పోలీసు శాఖకు సహాయం చేయమని అభ్యర్థిస్తుంది మీనాక్షి. ఆ తర్వాత అసలు కథ మొదలు అవుతుంది. YD రాజు హెల్ప్ చేస్తాడా? YD రాజు భార్య రెస్క్యూ మిషన్‌లో ఎందుకు భాగం కావాలనుకున్నారు? అనేది మిగిలిన కథ.
సానుకూల అంశాలు:
ఫస్ట్ హాఫ్
పాటలు
వెంకటేష్ కామెడీ టైమింగ్
ఐశ్వర్య రాజేష్ ఇన్నోసెంట్ పెర్ఫార్మెన్స్
వెంకటేష్ పై ప్రీ క్లైమాక్స్ సీక్వెన్స్
భీమ్స్ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
ప్రతికూలతలు:
సెకండాఫ్‌లో టాప్ సీక్వెన్సులు
ఉపేంద్ర లిమాయే ఫోర్స్డ్ కామెడీ
సరైన కథ లేకపోవడం
లాజిక్ లెస్ రైటింగ్