రజినీకాంత్ జైలర్-2 లో నందమూరి హీరో..బాక్సాఫీస్ షేకే..?

frame రజినీకాంత్ జైలర్-2 లో నందమూరి హీరో..బాక్సాఫీస్ షేకే..?

Pandrala Sravanthi
రజినీకాంత్
  ఇప్పటికే ఏడు పదుల వయస్సు దగ్గరికి వస్తున్నా కానీ  సినిమాల్లో దూసుకుపోతున్నారు. ఆ మధ్య కాలంలో జైలర్ సినిమాతో వచ్చి తన కెరియర్ లోనే అద్భుతమైన హిట్ సాధించాడు. అలాంటి జైలర్ కు సీక్వెల్ గా  జైలర్ 2 రాబోతున్న విషయం మనందరికీ తెలుసు. జైలర్ సినిమా కంటే జైలర్ 2 సినిమా ను చాలా అద్భుతంగా తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో నలుగురు హీరోలు ఉంటారని, టాలీవుడ్ నుంచి కూడా ఒక హీరో ఇందులో చేయబోతున్నారని సమాచారం. ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటినుంచి అభిమానులు జైలర్ 2 సినిమా అప్డేట్ గురించి ఎదురుచూస్తున్నారు. 

అయితే ఈ సినిమాకు సంబంధించిన మొదటి ప్రకటన సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవ్వబోతోంది. ఈ సమయంలోనే జైలర్-2 సినిమా లో తెలుగు హీరో ఎవరు అని చాలామంది అభిమానులు ఆరాతీస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్ చేయబోతున్నారని సమాచారం. ఇది నిజంగానే జరుగుతుందా లేదంటే రూమర్ గా మిగిలిపోతుందా అనేది ముందు ముందు తెలుస్తుంది. 
ఇక ఈయనే కాకుండా మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లు ఉండబోతున్నారని సమాచారం.

మొత్తం నాలుగు భాషల్లో టాప్ స్టార్స్ ని ఎంపిక చేసి జైలర్ -2 సినిమాను తెరకెక్కించాలని డైరెక్టర్, చిత్ర యూనిట్ వారు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఏది ఏమైనా  అన్ని వర్కౌట్ అయి ఈ సినిమా లో నలుగురు హీరోలు ఉంటే మాత్రం  బాక్సాఫీస్ షేక్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.ఇక జైలర్-2 సినిమా తమిళ ఇండస్ట్రీలోనే మొదటి 1000 కోట్ల సినిమా అవుతుంది అంటూ చాలామంది ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నారు. ప్రస్తుతం రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూలి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.ఈ సినిమాలో నాగార్జున, శివ కార్తికేయన్ లు కూడా నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: