సంక్రాంతికి వస్తున్నాం : అనిల్ హిట్ ట్రాక్ కంటిన్యూ అయినట్లేనా..?

frame సంక్రాంతికి వస్తున్నాం : అనిల్ హిట్ ట్రాక్ కంటిన్యూ అయినట్లేనా..?

Pulgam Srinivas
తెలుగు సినిమా పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన సినిమా ఇండస్ట్రీ లో కెరియర్ను చాలా సంవత్సరాల క్రితం మొదలు పెట్టిన ఈయన కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత చాలా సంవత్సరాల పాటు సినిమాలకు కథ రచయితగా పని చేశాడు. అలా చాలా సంవత్సరాల పాటు కథ రచయితగా పని చేసిన ఈయన కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన పటాస్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని దర్శకుడిగా తనకంటూ ఒక మంచి స్థానాన్ని తెలుగు సినిమా పరిశ్రమలో ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఆ తర్వాత అనిల్ దర్శకత్వం వహించిన సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు , ఎఫ్ 3 , భగవంత్ కేసరి సినిమాలను అందుకున్నాయి. ఇకపోతే తాజాగా ఈయన విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ ఈ రోజు అనగా జనవరి 14 వ తేదీన విడుదల కానుంది. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లు ఇప్పటికే ఇతర దేశాల్లో ప్రదర్శించబడ్డాయి. అక్కడి నుండి ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ పాజిటివ్ టాక్ వస్తుంది.

ఈ టాక్ ను బట్టి చూస్తే ఈ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇలా ఇప్పటివరకు దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతో విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ను అలాగే కంటిన్యూ చేస్తాడు అనే అభిప్రాయాన్ని చాలా మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: