సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగ వచ్చింది అంటే చాలు టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఎక్కువ శాతం విడుదల అవుతూ ఉంటాయి. దానితో జనాలు కూడా ఆ సినిమాలను చూడడానికి అత్యంత ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉండడంతో సంక్రాంతి పండక్కు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన సందడి వాతావరణం నెలకొంటూ ఉంటుంది. ఇకపోతే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా మొదటగా రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ సినిమా విడుదల కాగా , ఆ తర్వాత బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ సినిమా విడుదల అయ్యింది. ఇక ఈ రోజు అనగా జనవరి 14 వ తేదీన విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ మూడు సినిమాల్లో కూడా అన్ని మూవీల కంటే ముందుగా విడుదల అయిన గేమ్ చేంజర్ మూవీకి ప్రేక్షకుల నుండి నెగిటివ్ టాక్ వచ్చింది. ఇక ఆ తర్వాత విడుదల అయిన డాకు మహారాజ్ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి టాక్ వచ్చింది.
దానితో ఈ మూవీ కి మంచి కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఇకపోతే ఈ రోజు విడుదల అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సంబంధించిన షో లు ఇప్పుడే తెలుగు రాష్ట్రాల్లో మొదలు అయిన ఈ మూవీ కి సంబంధించిన షో లు ఇప్పటికే కొన్ని దేశాల్లో కంప్లీట్ అయ్యాయి. అక్కడి నుండి ఈ సినిమాకు సూపర్ సాలిడ్ పాజిటివ్ టాక్ వస్తుంది. దానితో వెంకీ మరోసారి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో బ్లాక్ బాస్టర్ కొట్టాడు అని కొంత మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు. దీనితో ఈ సంవత్సరం సంక్రాంతికి ఒక రామ్ చరణ్ కు మినహాయిస్తే బాలయ్యకు , వెంకటేష్ కు అద్భుతంగా కలిసి వచ్చింది అని అభిప్రాయాలను కొంత మంది వ్యక్తపరుస్తూ వస్తున్నారు.