' పోకిరి ' లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా..?

frame ' పోకిరి ' లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా..?

RAMAKRISHNA S.S.
( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కి.. 2006 సమ్మర్ కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన పోకిరి సినిమా.. అప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైం బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. వాస్తవానికి పూరి జగన్నాథ్ ఈ కథను అంతకు ఆరేళ్ల ముందుగానే రాసుకున్నారు. పూరి.. పవన్ కళ్యాణ్ తో తెర‌కెక్కించిన బద్రి సినిమా కన్నా ముందే.. పోకిరి కథ రాసుకున్నారట. తొలత ఈ కథకు హీరోలుగా పవన్ కళ్యాణ్, మాస్ మహారాజ్ రవితేజలను అనుకున్నారు. బద్రి సినిమా హిట్ అయ్యాక ఈ కథ పవన్‌కు బాగా సూట్ అవుతుందని అనుకున్నారట.

అయితే కథ విన్న పవన్.. హీరో మరి నెగటివ్ రోల్‌లో ఉంటే ఎలా.. ఈ కథ తన ఇమేజ్‌కు సూట్ కాదని వదులుకున్నారు. ఆ తర్వాత రవితేజ పేరు కూడా పరిశీలించారు. అయితే అప్పటికే పూరితో ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి లాంటి సినిమాలు రవితేజ చేసి ఉన్నారు. పోకిరి సినిమాలో హీరో పాత్ర కూడా అలానే ఉండటంతో రవితేజ చేయలేదు. చివరకు ఇది అటు, ఇటు తిరిగి.. మహేష్ బాబు దగ్గరికి చేరింది. మహేష్ ఈ స్క్రిఫ్ట్‌ లోకి ఎంట్రీ ఇచ్చాక.. పోకిరి కథలో కొన్ని మార్పులు.. చేర్పులు.. చేసి మహేష్ ఇమేజ్‌కు తగినట్టుగా మార్చారు.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఇలియానా పాత్ర‌ను ముందుగా సూప‌ర్ హీరోయిన్ అయేషా టాకియాను అడ‌గ‌గా ముందుగా ఆమె కొన్ని కారణాలతో ఈ పాత్ర వదులుకుంది. తర్వాత బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగన రనౌత్‌ను ఈ సినిమాకు తీసుకున్నారు. అయితే అదే టైంలో బాలీవుడ్ సినిమా గ్యాంగ్ స్టార్‌కు డేట్లు ఇవ్వాల్సి రావడంతో.. ఆమె పోకిరి సినిమా వదులుకుంది. చివరకు ఆ అవకాశం అప్పటికే దేవదాసు సినిమాతో తెలుగు కుర్ర కారు హృదయంలో గిలిగింతలు పెట్టిన ఇలియానాకు దక్కింది. పోకిరి హిట్టయ్యాక ఇలియానా టాలీవుడ్‌లో వెనక్కి తిరిగి చూసుకోకుండా ఏడెనిమినది సంవత్సరాలు దూసుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: