కుంభమేళాలో 'అఖండ 2' తాండవం..?
అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి సినిమాలతో 100 కోట్లకు పైగా కలెక్షన్లను కలెక్ట్ చేసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నాడు. తాజాగా బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అటు ఇప్పటికే అఖండ-2 సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఈ సంవత్సరం దసరా కానుకగా సెప్టెంబర్ 25న విడుదల చేయనున్నారు. ఇదివరకే ఈ సినిమా నుంచి చిన్న మ్యూజిక్ గ్లింప్స్ సైతం విడుదల చేశారు.
ఈ సినిమాను బాలయ్య రెండో కూతురు తేజస్విని సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంటలు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. డాకు మహారాజ్ సినిమా అనంతరం అఖండ-2 సినిమాతో బాలయ్య బాబు అభిమానుల ముందుకు రానున్నాడు. అయితే ప్రయాగ్ రాజులో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రయాగ్ రాజ్ కుంభమేళ లోనే అఖండ-2 సినిమా షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది.
ఇక్కడికి కోట్లాదిమంది భక్తులు, సాధువులతో పాటు అఘోరాలు భారీ సంఖ్యలో హాజరు కాబోతున్నారు. అఖండ సినిమాలో బాలకృష్ణ అగోరా పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అఖండ-2 లోను అదే పాత్రను కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కుంభమేళలో అఖండ పాత్ర ఉన్నట్లు, అక్కడి అఘోరాలతో కలిసి తిరుగుతున్నట్లు, త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్నట్లుగా కొన్ని షాట్స్ షూటింగ్ చేసినట్లు సమాచారం. ఈసారి డివైన్ షాట్స్ మరింత గ్రాండ్ గా ఉండనున్నాయని తెలుస్తోంది.