50 ఏళ్ళ హీరోయిన్ తో 20 ఏళ్ల కుర్రాడు డేటింగ్ ?

frame 50 ఏళ్ళ హీరోయిన్ తో 20 ఏళ్ల కుర్రాడు డేటింగ్ ?

Veldandi Saikiran
బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నాని సినిమాలో నటించింది. ఆ సినిమా అనంతరం తెలుగులో కొన్ని సినిమాలలో నటించి అభిమానులను ఆకట్టుకుంది. తెలుగుతోపాటు హిందీలోనూ అనేక సినిమాల్లో అమీషా నటించింది. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. చాలా రోజుల గ్యాప్ తర్వాత అమీషా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇటీవల గదర్-2 సినిమాలో ఈ బ్యూటీ నటించిన సంగతి తెలిసిందే.

ఈ బ్యూటీ వయసు 49 సంవత్సరాలు. అయినప్పటికి వివాహం చేసుకోకుండా సింగిల్ గానే ఉంటుంది. వివాహం చేసుకోనప్పటికీ ఈ బ్యూటీ చాలా మందితో ఎఫైర్లు పెట్టుకున్నట్టు, ప్రేమ వ్యవహారాలు నడిపినట్టు కొంతమంది హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వీరిలో అమీషా ఎవరిని కూడా వివాహం చేసుకోలేదు. సోషల్ మీడియాలో అమీషా చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం ఏదో ఒక పోస్ట్ షేర్ చేసుకుంటూ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటుంది.

తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా వరుస పెట్టి ఫోటోషూట్లు చేస్తూ ఆ ఫోటోలతో కుర్రాళ్ళు మతులు పోగొడుతుంది. ఇదిలా ఉండగా.... ఈ బ్యూటీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అమీషా తనకన్నా 20 ఏళ్లు చిన్నవాడైన సింగర్ నిర్వాన్ బిర్లాతో డేటింగ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దానికి గల ప్రధాన కారణం వారిద్దరూ కలిసి ఫోటోలు తీసుకున్నారు.

ఆ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి. అయితే ఆ వార్తలను నిర్వాన్ ఖండించారు. ఆ రూమర్స్ పై నిర్వాన్ స్పందిస్తూ అమీషా మా ఫ్యామిలీ ఫ్రెండ్. మా నాన్నకు చిన్నప్పటినుంచి అమీషా తెలుసు. మేమిద్దరం మ్యూజిక్ ఆల్బమ్ కోసం దుబాయ్ వెళ్ళాం. అని నిర్వాన్ పేర్కొన్నారు. కానీ వీరిద్దరూ క్లోజ్ గా ఫోటో తీసుకోవడం చూస్తుంటే వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: