గేమ్ చేంజర్: మెగా ఫ్యామిలీ పరువు తీసిన ప్రపంచ యాత్రికుడు !

frame గేమ్ చేంజర్: మెగా ఫ్యామిలీ పరువు తీసిన ప్రపంచ యాత్రికుడు !

Veldandi Saikiran
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్... తాజాగా చేసిన సినిమా గేమ్ చేంజర్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. మొన్న పదవ తేదీన.... రామ్ చరణ్ నటించిన గేమ్ చేజర్ సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు. అయితే సినిమా రిలీజ్ కంటే ముందు... చాలా హైప్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా వచ్చి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో దంచేశాడు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్స్ సినిమా బ్రహ్మాండంగా ఉంటుందని తెలిపాడు.
 

దీంతో రామ్ చరణ్ నటించిన గేమ్ చందర్ సినిమా హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ జనవరి 10వ తేదీన రిలీజ్ అయిన తర్వాత... అంచనాలు మొత్తం తార్ మారాయి. సినిమాపై నెగటివ్ టాక్ వచ్చేసింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్టింగ్ అదరగొట్టినప్పటికీ శంకర్ దర్శకత్వం వైఫల్యం స్పష్టంగా కనిపించింది. దీంతో జనాలందరూ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజెర్ సినిమాకు... వెళ్లకుండా ఆగిపోయారని చెప్పవచ్చు.
 

ఇక మధ్యాహ్నం వరకు అసలు సినిమా టికెట్లు కొనేవాడే లేనట్లు... సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి.  అయితే ఇలాంటి నేపథ్యంలో.. మొదటిరోజు 186 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. మొదటిరోజు కలెక్షన్ల పై కూడా ట్రోలింగ్ జరిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలో గేమ్ చేoజర్ సినిమాపై... ప్రపంచ యాత్రికుడు అవినాష్... సెటైర్లు పేల్చాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న అవినాష్... గేమ్ చేంజెర్ సినిమాకు వెళ్తున్నట్లు ఓ వీడియో పెట్టాడు.
 

ఇక ఈ వీడియోలో... సినిమా నడుస్తున్నప్పటికీ సీట్లలో ఒక్క మనిషి కూడా లేడు. దీంతో దుబాయ్ లో కూడా రామ్ చరణ్ కు... ఫ్యాన్స్ ఎవరూ లేరని... గేమ్ చేంజర్ సినిమా పట్టించుకునే వాడు లేడని.. సోషల్ మీడియాలో సెటైర్లు పేల్చుతున్నారు నేటిజన్స్. ఇక ఈ వీడియోను వైసీపీ పార్టీ సోషల్ మీడియా తెగ వాడేసుకుంటుంది. రామ్ చరణ్ అలాగే పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా ఈ వీడియోను వాడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: