సినిమా బడ్జెట్ పై అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్..!
ఇక తాజాగా వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం మరో బ్లాక్ బస్టర్ గా నిలవనుంది. ఈ సందర్భంగా అనిల్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ.. 'నేను సినిమా చేసే హీరోకి ఉన్న మార్కెట్ ఏంటి..? ఆ హీరోతో సినిమా చేసేటప్పుడు బడ్జెట్ ఎంతలోపు చేయాలి.. రిలీజ్ చేసే టైమ్‌కి నిర్మాత ఎంత సేఫ్‌లో ఉండాలి అనేది ఫస్ట్ నేను చూసుకుంటాను. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది బిజినెస్. కేవలం క్రేజ్ ఒక్కటి సరిపోదు. డబ్బు ఎవరైనా సరే కష్టపడి సంపాదిస్తారు. కనుక వాళ్ల డబ్బుతో నువ్వు గేమ్ ఆడకూడదు. నీ డబ్బుతో నువ్వు ఆడుకోవచ్చు కానీ వేరే వాళ్ల డబ్బుతో ఆడుతున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నా అభిప్రాయం.. అందుకే నేను ఎప్పుడూ బడ్జెట్‌ని దాటి సినిమా తీయను. నాకు అనిపిస్తుంది.. నేను అద్భుతంగా ఖర్చు పెట్టి, మేకింగ్, విజువల్స్ తీయొచ్చు కదా అని కానీ ప్రాజెక్టుకి సరిపడే చేస్తాను' అంటూ అనిల్ రావిపూడి అన్నారు.