'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ రిజెక్ట్ చేసిన ఆ తెలుగు హీరో.. అనిల్ రావిపూడి పిచ్చ హ్యాపీ..!
క్రేజీ క్రేజీ కామెంట్స్ జనాలు ఈ సినిమాపై చేస్తూ వస్తున్నారు. మరి ముఖ్యంగా తెరపై వెంకటేష్ - ఐశ్వర్య రాజేష్ కామెడీ హైలెట్ గా మారింది అంటూ పోగిడేస్తున్నారు . అనిల్ రావిపూడి డైరెక్షన్ ఎప్పుడు ఒకేలా ఉంది అని..ఎఫ్ 2,ఎఫ్3 కి మించిన స్థాయిలో ఈ సినిమా హిట్ అయింది అంటూ పొగిడేస్తున్నారు . కాగా అందుతున్న సమాచారం ప్రకారం మొదటి రోజు ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 16 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది అంటున్నారు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇతర రాష్ట్రాలలో రెండు కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది . ఇక కర్ణాటక నార్త్ అమెరికా ఇతర దేశాలలో కలిపి ఈ సినిమా మొత్తంగా 18 కోట్లు చేసినట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది.
అంటే దాదాపు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 36 కోట్లు వసూలు చేసింది అనమాట. కాగా ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే ఇంకా 85 కోట్ల సాధించాల్సి ఉంది . కాగా అనిల్ రావిపూడి సినిమాను చాలా ఎంటర్టైనింగ్ తెరకెక్కించారు . నిజానికి ఎఫ్ త్రీ సినిమా తర్వాత ఈ కథను రాసుకున్నారట అనిల్ రావి పూడి. బ్యాక్ టూ బ్యాక్ ఫన్ ఎమటర్టైన్ మెంట్ బోర్ కొట్టేస్తుంది అని మధ్యలో "భగవంత్ కేసరి" సినిమాని బాలయ్యతో చకచగా కంప్లీట్ చేసేసి ..ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం అంటూ నాగార్జునతో ఈ మూవీని తెరకెక్కించాలనుకున్నారట . నాగార్జునకి కూడా స్టోరీ వివరించారట. కానీ నాగార్జున ఈ సినిమాను రీజన్ లేకుండానే రిజెక్ట్ చేశారట . బహుశా ఫ్యామిలీ రీజన్స్ అయుండచ్చు అంటున్నారు జనాలు. అయితే వెంకటేష్ ఈ సినిమాలో బాగా సూట్ అవుతాడు అని వెంకీ మామకు కథ చెప్పగానే ఓకే చేసేసాడట.. అనిల్ రావిపూడి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..!