పవన్ కళ్యాణ్ - సౌందర్య కాంబినేషన్లో మిస్ అయిన సూప‌ర్ హిట్ సినిమా.. చేసుంటే సూప‌రే..!

frame పవన్ కళ్యాణ్ - సౌందర్య కాంబినేషన్లో మిస్ అయిన సూప‌ర్ హిట్ సినిమా.. చేసుంటే సూప‌రే..!

RAMAKRISHNA S.S.
సినిమాల్లో కొన్ని కాంబినేషన్‌లు చూడటానికి బాగున్నా.. అవి ఎంత ట్రై చేసినా వర్కౌట్ అవ్వవు. కొన్ని కాంబినేషన్‌లు చేతులు దాకా వచ్చి చేజారి పోతూ ఉంటాయి. అలాంటి కాంబినేషన్లలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దివంగత మహానటి సౌందర్య కాంబినేషన్ ఒకటి. మెగాస్టార్ చిరంజీవికి జోడిగా సౌందర్య ఎన్నో సినిమాలలో నటించారు. ఇక చిరంజీవి తమ్ముడుగా హీరోగా ఎంట్రీ ఇచ్చి సూపర్ స్టార్ గా పవన్ కళ్యాణ్ చలామణి అవుతున్న రోజులు అవి.

అప్పుడే కొత్తగా ఇండస్ట్రీలోకి అక్కడ అబ్బాయి.. ఇక్కడ అమ్మాయి.. సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత గోకులంలో సీత సినిమా చేశాడు. మూడో సినిమా సుస్వాగతం పవన్ హీరోగా ఇంట్రీ ఇచ్చిన తర్వాత.. పవన్ కెరీర్‌లో భారీ బ్లాక్ బస్టర్ సినిమాగా సుస్వాగతం నిలిచింది. పవన్ కళ్యాణ్ నటన ఎంతో అద్భుతంగా ప్రతి ఒక్కరి హృదయాలను టచ్ చేసింది. ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాలలో పవన్ కళ్యాణ్ నటన ఇప్పటికీ మర్చిపోలేనిది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ నటించేముందు ఈ సినిమాలో సౌందర్యను హీరోయిన్గా తీసుకోవాలని అనుకున్నారట.

అయితే శ్రీనివాసరావు అలాంటి పాత్రలో సౌందర్య అయితే బాగా సూట్ అవుతుందని చెప్పినా.. పవన్ కళ్యాణ్ మాత్రం నో చెప్పారట. అలాంటి గొప్ప న‌టి ముందు తాను కలిసి నటించలేనని చెప్పడంతో అప్పుడు త‌మిళ్‌ స్టార్ దేవయానీని తీసుకుని సుస్వాగతం సినిమాని తెర‌కెక్కించారు. ఈ సినిమా ఆ రోజుల్లోనే ఫుల్ రన్‌లో ఐదు కోట్లకు పైగా భారీ కలెక్షన్ రాబట్టింది. ఇప్పటికీ ఈ సినిమా పవన్ అభిమానులకు ఎంతో ఇష్టం. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశానికి ముందు.. పవన్ కళ్యాణ్ తండ్రి రఘువరన్ చనిపోయినప్పుడు వచ్చే ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో అంటూ.. సాగే ఈ పాటని ఇప్పుడు చూసిన ప్రేక్షకుల కళ్ళు చెమ‌రిస్తూ ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: