ఆ హీరోయిన్‌తో జగపతిబాబు సీక్రెట్ అఫైర్.. ఫ్లాట్ కూడా కొనిచ్చాడా...!
వ్యక్తిగతంగా కూడా జగపతిబాబు సినీ కుటుంబ నేపథ్యం నుంచి రావడంతో ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు. జగపతిబాబు కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌లతో ఎఫైర్‌లు నడిపినట్టు ప్రచారం జరిగింది. అలాగే సినిమాల ద్వారా సంపాదించిన కోట్ల ఆస్తిని జగపతిబాబు చాలావరకు పోగొట్టుకున్నాడని అంటారు. లెజెండ్ సినిమాతో విలన్ గా నటించి రీఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నాడు జగపతిబాబు. ఒకానొక టైంలో దివంగత హీరోయిన్ సౌందర్యతో ప్రేమాయణం నడిపినట్టు వార్తలు ఉన్నాయి. అలాగే యమదొంగ హీరోయిన్ ప్రియమణితోను గాఢమైన ప్రేమాయణం నడిపించాడని అంటారు.
ఈ ముద్దుగుమ్మ జగ్గు భాయ్‌తో కలిసి పెళ్లయిన కొత్తలో సినిమా చేసింది. ఇందులో వీరు ఇంటెన్స్ రొమాంటిక్ సీన్లలో నటించారు. అప్పుడే వారి మధ్య ఎఫైర్ మొదలైందని అంటారు. ఈ సినిమా తర్వాత కూడా ప్రవరాఖ్యుడు, సాధ్యం, క్షేత్రం లాంటి సినిమాలలో మళ్లీ జత కట్టారు. అలా నాలుగు సినిమాలు కలిసి చేయడంతో వీళ్ళిద్దరూ బాగా దగ్గరయ్యారని కొన్నాళ్లపాటు.. సీక్రెట్ రిలేషన్‌షిప్ మైంటైన్ చేశారని సినీ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఒకానొక టైంలో ప్రియమణి సైతం తామిద్దరం మంచి స్నేహితులు మాత్రమే అని తెలిపింది. అయితే.. జగపతిబాబు, ప్రియమణి విషయంలో ఈ రూమర్లు మాత్రం గట్టిగా వినిపించాయి.