అందరూ బాలేదంటుంటే.. 'గేమ్ ఛేంజర్' గురించి చరణ్ ఏమన్నాడో తెలుసా?

frame అందరూ బాలేదంటుంటే.. 'గేమ్ ఛేంజర్' గురించి చరణ్ ఏమన్నాడో తెలుసా?

praveen
రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న "గేమ్ ఛేంజర్" మూవీ ఎట్టకేలకు జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ తీయడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఇక ఈ మూవీలో రామ్ చరణ్ సరసన క్యూట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించగా, మరో ముఖ్యమైన పాత్రలో అంజలి కూడా కనిపించింది.
సినిమా విడుదలైన నాలుగు రోజులకే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా తన సంతోషాన్ని, కృతజ్ఞతను వ్యక్తం చేశాడు. సినిమా సక్సెస్ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపాడు.
"ఈ సంక్రాంతికి నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. 'గేమ్ ఛేంజర్' కోసం మేం పడిన కష్టానికి తగిన ఫలితం దక్కింది. ఈ సినిమా సాధ్యం కావడానికి కారణమైన నటీనటులు, సిబ్బంది, తెర వెనుక పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. మీ ప్రేమ, మద్దతు నాకు చాలా ముఖ్యం. మా సినిమా గురించి మంచి రివ్యూలు ఇచ్చిన మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు. మీ వల్లే ఇది సాధ్యమైంది.
2025లోకి అడుగుపెడుతున్న సందర్భంగా, మిమ్మల్ని గర్వపడేలా చేసే ప్రదర్శనలు ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను. 'గేమ్ ఛేంజర్' నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన సినిమా. మీ అన్‌కండిషనల్ ప్రేమకు ధన్యవాదాలు. మీకు, మీ ప్రియమైన వారికి సంతోషకరమైన సంక్రాంతి, అద్భుతమైన సంవత్సరం రావాలని కోరుకుంటున్నా!" అంటూ రామ్ చరణ్ ఎమోషనల్ గా పోస్ట్. చేశారు.
ఇక ఈ సినిమాలో ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, జయరామ్, సునీల్, బ్రహ్మానందం వంటి స్టార్ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించగా, తమన్ మ్యూజిక్ అందించారు. సినిమా విడుదలైనప్పటి నుంచే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబడుతోంది.
అయితే, ఈ సినిమా వసూళ్ల విషయంలో కొంచెం కాంట్రవర్సీ నడుస్తోంది. ఫిల్మ్ మేకర్ రామ్ గోపాల్ వర్మ "గేమ్ ఛేంజర్" కలెక్షన్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలు చెబుతున్న లెక్కలకు, ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్కలకు చాలా తేడా ఉందని ఆయన అంటున్నారు.
నిర్మాతల ప్రకారం, "గేమ్ ఛేంజర్" విడుదలైన మొదటి రోజే అంటే జనవరి 10న ఏకంగా రూ.186 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ విషయాన్ని అధికారికంగా సినిమా సోషల్ మీడియా పేజీలో అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమా ఇండియాలో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాల్లో నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఈ లిస్టులో పుష్ప 2, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాలు ముందున్నాయి. కానీ, ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ ప్రకారం సినిమా మొదటి రోజు వసూళ్లు కేవలం రూ.80 కోట్ల- రూ.100 కోట్ల మధ్యలోనే ఉన్నాయని తెలుస్తోంది. ఈ లెక్కల్లో తేడా ఉండటంతో ఇండస్ట్రీలో చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై విమర్శలు కూడా వస్తున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: