సంక్రాంతికి వస్తున్నాం: జనసేన రికార్డు బ్రేక్ చేసిన అనిల్...?
ఈ సినిమాపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలను పెట్టుకోగా....విడుదలైన ఒక్క రోజులోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రతి సంక్రాంతికి వెంకటేష్ ఏదో ఒక సినిమాతో అభిమానుల ముందుకు వస్తాడు. మంచి సక్సెస్ పొందుతాడు. అలాగే ఈసారి కూడా సంక్రాంతికి అభిమానుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నాడని వెంకటేష్ ను మెచ్చుకుంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కు వెంకటేష్ విపరీతంగా నచ్చుతాడు.
సంక్రాంతికి వస్తున్నాం సినిమా బ్లాక్ బస్టర్ అయిందని అభిమానులు అంటున్నారు. కాగా, ఈ సినిమా ఓటిటి హక్కులను జీ గ్రూప్ సంస్థ దక్కించుకుందని వార్తలు వస్తున్నాయి. దీంతో జిఫైవ్ ఓటిటిలో సంక్రాంతి వస్తున్నాం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కాదని కన్ఫామ్ అయింది. అది తక్కువ సమయంలోనే అంటే ఫిబ్రవరి నెలలోనే ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాదని సమాచారం. ఇదిలా ఉండగా.... దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోవడంతో చిత్ర బృందం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
అనిల్ రావిపూడి ఇప్పుడు వరుసగా ఎనిమిది సినిమాలకు దర్శకత్వం వహించి ఎనిమిది సినిమాలను సక్సెస్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన డెబ్యు మూవీ 'పటాస్' సినిమా సూపర్ హిట్ అవడంతో ఆ సినిమా అనంతరం సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్-2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్-3, భగవంత్ కేసరి వంటి సినిమాలు సక్సెస్ అందుకున్నాయి. దీంతో 100% సక్సెస్ రేటింగ్ కొనసాగిస్తున్న దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచాడు. అయితే...మొన్న జనసేన పార్టీ కూడా ఎన్నికల్లో 100% సక్సెస్ రేటింగ్ సాధించింది.