అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..కళ్ళు చెదిరి ఆఫర్ అందుకున్న అంజలి..లైఫ్ లో మర్చిపోలేనిది..!

frame అబ్బబ్బా..ఎన్నాళ్లకి ఎన్నాళ్లకి..కళ్ళు చెదిరి ఆఫర్ అందుకున్న అంజలి..లైఫ్ లో మర్చిపోలేనిది..!

Thota Jaya Madhuri
నిజంగా.. ఇది హీరోయిన్ అంజలికి జాక్ పాట్ ఆఫర్ అనే చెప్పాలి. అంజలి తెలుగు అమ్మాయి.  అయినా సరే తెలుగులో మాత్రం పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. రీజన్ ఏంటో తెలియదు కానీ పెద్ద సినిమాలల్లో అవకాశాలు అందుకోలేకపోయింది. అంజలి అందంగా ఉంటుంది . చక్కగా నటిస్తుంది . తెలుగు అనర్గళంగా మాట్లాడగలదు . మరి ముఖ్యంగా ఫేస్ టు ఫేస్ టైప్ . ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది . అలాంటి హీరోయిన్ కి తెలుగు డైరెక్టర్లు అవకాశాలు ఎందుకు ఇవ్వరు అంటూ చాలామంది  ప్రశ్నించారు.


అయితే కోలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అంజలి టాప్ హీరోయిన్ . రీసెంట్ గా 'Game Changer' సినిమాలో నటించి తన నటనకు మంచి మార్కులు వేయించుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన సినిమానే ఈ 'గేమ్ చేంజర్'. ఈ సినిమాలో అంజలి సెకండ్ హీరోయిన్గా నటించింది . బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకునింది . ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా అంజలి నటనను పొగిడేస్తున్నారు. ఖచ్చితంగా నేషనల్ అవార్డ్ పక్క అంటూ కామెంట్స్ పెడుతున్నారు.


కాగా "గేమ్ చేంజర్" సినిమా ఫ్లాప్ అయినా సరే అంజలి ఖాతాలో బడా తెలుగు సినిమా ఆఫర్ వచ్చి చేరింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.  త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా కి కమిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలా అంటూ ఓ వార్త బాగా ట్రెండ్ అయింది . అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా మీనాక్షి చౌదరి సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపించాయి . కాగా రీసెంట్గా ఆ ప్లే లోకి అంజలి వచ్చి చేరిన్నట్లు  తెలుస్తుంది. గేమ్ చేంజర్ సినిమాలో అంజలి పెర్ఫార్మన్స్ చూసిన తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో అంజలి పేరు మారు మ్రోగిపోతుంది . అంజలి లైఫ్ సెటిల్మెంట్ ఆఫర్ ఇది అంటూ పొగిడేస్తున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: