నిధి అగర్వాల్ , కాజల్ మధ్య సవతి పోరు ?
అనంతరం ఇస్మార్ట్ శంకర్, మిస్టర్ మజ్ను వంటి సినిమాల్లో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఇస్మార్ట్ బ్యూటీగా నిది అగర్వాల్ కి పేరు వచ్చింది. దాంతో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని అందుకుంది. ఈ సినిమా షూటింగ్ కాస్త వాయిదా పడుతూనే వస్తుంది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల సినిమా షూటింగ్ రెగ్యులర్ గా నిర్వహించలేకపోతున్నారు.
పవన్ కళ్యాణ్ కి సమయం దొరికినప్పుడే సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై నిధి అగర్వాల్ రీసెంట్ గా స్పందించారు. ఇది ఇలా ఉండగా ఈ బ్యూటీ చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. తాను ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్పే బ్యాచ్ కాదంటూ నిధి అగర్వాల్ హీరోయిన్ కాజల్ ని ఉద్దేశించి కామెంట్లు చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాజల్ ఎక్కడికి వెళ్ళినా అందరికీ నమస్కారం అని చెబుతూ మాట్లాడడం ప్రారంభిస్తుంది.
ఈ మాటని ఉద్దేశించి నిధి అగర్వాల్ ఈ కామెంట్ చేసింది. తనకు కొంచెం తెలుగు వచ్చు అనే ఉద్దేశంతోనే ఆ మాట అన్నట్టుగా నిధి అగర్వాల్ స్పష్టం చేశారు. అందులో ఎవరిని ఉద్దేశించి ఈ మాట అనడం లేదని నిధి అగర్వాల్ తెలిపింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ హరిహర వీరమల్లు, ది రాజాసాబ్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది.