గేమ్ చేంజర్ : ప్రమాదంలో చరణ్‌..వెన్నుపోటు పొడిచింది వీళ్లేనా?

frame గేమ్ చేంజర్ : ప్రమాదంలో చరణ్‌..వెన్నుపోటు పొడిచింది వీళ్లేనా?

Veldandi Saikiran

గ్లోబల్ స్టార్ రామ్-చరణ్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరోగా నటించగా....కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. ఎస్ జె సూర్య, శ్రీకాంత్, సునీల్ తదితరులు కీలక పాత్రను పోషించారు. ఈ సినిమాను ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దాదాపు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగింది. ఇక ఈ సినిమా విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ సినిమాకు ఒకదాని తర్వాత మరొకటి షాపులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాను పైరసీ భూతం వెంటాడింది. హెచ్ డి ప్రింట్ ఆన్లైన్ లోకి వచ్చింది.

తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్, టెలిగ్రామ్, ఐ బొమ్మ, ఫిల్మీ జిల్లా వంటి వెబ్సైట్ లలో ఈ సినిమా ఇప్పుడు విస్తృతంగా సర్క్యులేట్ అవుతోంది. ఆ ప్రింట్ ను సంక్రాంతికి ఊరు వెళ్తున్న వారి కోసం ఇటీవలే బస్సులలో టెలికాస్ట్ చేయగా దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ విషయం తెలిసిన వెంటనే చిత్ర బృందం స్పందించింది. పైరసీని అస్సలు సపోర్ట్ చేయకూడదని దానివల్ల నిర్మాతలు భారీగా నష్టపోతారని అన్నారు.

అంతే కాకుండా సినిమాను కేవలం థియేటర్లలో మాత్రమే చూడాలని వెల్లడించారు. తాజాగా ఈ సినిమా ఏపీలోని కేబుల్ టీవీలో ప్రసారం అయినట్లుగా సమాచారం అవుతుంది. ఏపీ లోకల్ టీవీ ఛానల్ లో హెచ్డి ప్రింట్ ను ప్రసారం చేస్తున్నారని కొందరు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతున్నారు. దీనిపై మేకర్స్ వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: