"గేమ్ చేంజర్ లో" ఆ సీన్ చేయడానికి రామ్ చరణ్ అంతలా సిగ్గుపడ్డాడా.. వెరీ ఫన్నీ..!
ఈ సినిమా నెగటివ్ టాక్ అందుకుంది. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించిన ఒక్కొక్క వార్త సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా రీసెంట్ గా గేమ్ చేంజింగ్ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అన్న విషయం అందరికి తెలుసు. బాలీవుడ్ బ్యూటీ కియరా అద్వానీ..అలాగే తెలుగు హీరోయిన్ అంజలి. అయితే ఈ సినిమాలో అంజలి క్యారెక్టర్ కి మంచి మార్కులు పడ్డాయి.
ఈ సినిమా షూటింగ్ టైంలో ఓ సీన్ చేయడానికి రామ్ చరణ్ చాలా చాలా ఇబ్బంది పడ్డారట . ఎన్నో సినిమాల్లో రొమాంటిక్ సీన్లు చేసిన చరణ్..ఈ సినిమాలో ఓ సీన్ చేయడానికి మాత్రం చాలా చాలా సిగ్గుపడ్డారట. అంజలిని ఎత్తుకునే సీన్ ఒకటి ఉంటుంది ఐనిమాలో..ఆ సీన్ చేయడానికి ఇబ్బంది పడ్డారట చరణ్. అంజలితో రాంచరణ్ కి పెద్ద కనెక్షన్ లేదు . బయట మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. షూటింగ్ స్టార్ట్ అయిన వీళ్ళ కాంబోలో మొదటి సీన్ కి అలాంటి ఒక షాట్ చేయమనడంతో రామ్ చరణ్ చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాడట. సిగ్గు పడిపోతూ.. ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా ఈ సీన్ చేస్తాము అంటూ చరణ్ వెనకడుగు వేశారట. అంజలి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఈ సీన్ చేయడానికి ఓకే చేసిందట. కానీ రామ్ చరణ్ మాత్రం సిగ్గుపడిపోతూ ఉండడంతో శంకర్ అర్థం చేసుకుని తర్వాతనే ఆ సిన్న్ షూట్ చేద్దాం అని చరణ్ కి రెస్పెక్ట్ ఇచ్చారట. కొన్ని డేస్ అంజలి - చరణ్ ఫ్రెండ్ షిప్ చేసుకున్నాకే అలా ఎత్తుకునే సీను చిత్రీకరించారట . దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు తెలుగు ఫిలిం సర్కిల్స్ బాగా ట్రెండ్ అవుతుంది..!