హీరోయిన్ నిత్యామీనన్ కేవలం తెలుగులోనే కాకుండా మలయాళ, తమిళ్ ఇండస్ట్రీలలో దూసుకుపోతోంది. మొదట్లో ఎలాంటి ఎక్స్పోజింగ్ లేకుండా తెలుగింటి ఆడపిల్లల పాత్రలు చేసే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఎలాంటి పాత్రలో అయినా చేయడానికి రెడీ అవుతోంది. ఈ విధంగా సినిమాల్లో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో తరచూ వివాదాల్లో చిక్కుకుంటుంది. అయితే తాజాగా ఈమె దేవుడి పై చేసిన వ్యాఖ్యల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ మధ్యకాలంలోనే ఆమెకు ఒక నేషనల్ అవార్డు వచ్చిన విషయం అందరికీ తెలుసు.. అయితే ఈ అవార్డు రాకముందు ఆమె సినిమా ఫీల్డ్ వదిలేసి సైలెంట్ గా ఉందామని అనుకున్నదట.
అలా డెసిషన్ తీసుకుందో లేదో ఆమెకు నేషనల్ అవార్డు వచ్చింది.
దీంతో మళ్లీ సినిమాలకు కం బ్యాక్ ఇచ్చింది నిత్యామీనన్.. అవార్డు వస్తే ఆమె మళ్ళీ కంబ్యాక్ ఇస్తే ఎందుకు తిడతారు అని మీరు అనుకుంటున్నారు కదూ.. అయితే ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవుడు నాకు నేషనల్ అవార్డును లంచంగా ఇచ్చి సినిమాలు వదిలేయకుండా చేశాడని మాట్లాడింది. దీంతో చాలామంది హిందూ బాంధవులు దేవుడు లంచం ఇచ్చాడు అంటూ వ్యాఖ్యానిస్తావా అంటూ ఆమెపై దారుణంగా విరుచుకుపడుతూ ట్రోల్ చేస్తున్నారు. విధంగా ఆమె దేవుణ్ణి లంచం ఇచ్చే వాళ్ళుగా జమ కట్టిందని, తనకు హిందూ దేవుళ్ళపై గౌరవం లేదని అంటూ నేటిజన్స్ ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఈమె మాట్లాడిన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఒక్కొక్కరు ఒక్క విధంగా కామెంట్లు పెడుతూ ఆమెను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.. ఈ సందర్భంగానే ఆమె మరో విషయాన్ని కూడా బయట పెట్టింది. తనకు సినిమా ఫీల్డ్ ఇష్టం లేకున్నా కానీ వాళ్ళ ఫ్యామిలీ వారు ఒత్తిడి చేసి ఈ ఇండస్ట్రీలోకి పంపారట. తనకు వైల్డ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇంట్రెస్ట్ అంటూ చెప్పుకొచ్చింది.