బాలీవుడ్ టాప్ 10 విలన్ హీరోయిన్ల లిస్ట్ ఇదే..
కాజోల్:
బాబి డియోల్ ప్రధాన పాత్రలో నటించిన గుఫ్ట్ సినిమాలో కాజల్ సీరియల్ కిల్లర్ పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ఈషా దివాన్ పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజోల్ తన నటనకు గాను ఉత్తమ విలన్‌గా ఫిలింఫేర్ అవార్డును కూడా దక్కించుకుంది.
ప్రియాంక చోప్రా:
ఇక బాలీవుడ్‌లో రిలీజై మంచి సక్సెస్ అందుకున్న ఇత్రాజ్ సినిమాలో.. ప్రియాంక చోప్రా.. సోనియారాయ్ అనే అత్యాస ఉన్న మహిళా పాత్రలో నటించి ఆకట్టుకుంది.
శ్రీదేవి:
దివంగత అతిలోకసుందరి శ్రీదేవి సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుందో తెలిసిందే. అంతే కాదు.. అమ్మడు బాలీవుడ్‌లోను ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే బాలీవుడ్‌లో శ్రీదేవి జుదాయి, లాడ్ల సినిమాలో లేడీ విలన్ పాత్రలో మెప్పించింది.
టబు:
సౌత్ స్టార్ హీరోయిన్ టబుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లో రాణిస్తుంది. అయితే టబ్బు బాలీవుడ్‌లో అంధాధున్ సినిమాలో నెగిటివ్ రోల్‌లో నటించింది. సీమ సింహ పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది.
కొంకణ సేన్
బాలీవుడ్ హీరోయిన్ కొంకణ సెన్ శర్మ.. ఏక్ ది డయాన్ మూవీలో మంత్రగత్తెగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి అందరినీ భయపెట్టింది.
ఊర్మిళా మతోండ్కర్
బాలీవుడ్ మూవీ కోన్ లో సైకో కిల్లర్ గా ఊర్మిళ నటించి ఆడియన్స్‌ను భయపెట్టింది.
విద్యాబాలన్:
బాలీవుడ్‌లో ఇప్పటికి హీరోయిన్గా కొనసాగుతున్న విద్యాబాలన్.. ఇష్కీయా సినిమాల్లో విద్య కృష్ణ అనే క్రూరమైన స్త్రీ పాత్రలో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది.
అను అగర్వాల్:
ఆషీకీ సినిమాతో పాపులారిటీ దక్కించుకున్న అను అగర్వాల్.. క్లాసిక్ లో నెగటివ్ రోల్ లో నటించింది.
సిమి గారేవాల్
బాలీవుడ్ మూవీ కర్జ సినిమాలో సిమీ.. తన భర్తను హత్య చేసే నెగిటివ్ షేడ్స్ ఉన్న మహిళగా కమీనీ పాత్రలో నటించింది.
సుర్విన్ చావ్లా
పలు సినిమాలో హీరోయిన్గా నటించి ఆకట్టుకున్న సూర్వినీ చావ్లా.. విలన్ పాత్రలతోనే మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.