"గేమ్ చేంజర్ సినిమా అందుకే ఫ్లాప్ అయింది".. డైరెక్టర్ శంకర్ సెన్సేషనల్ కామెంట్స్..!
ఈ సినిమాతో రామ్ చరణ్ కి నేషనల్ అవార్డ్ పక్క అంటూ రాసి పెట్టుకోండి అని కూడా కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఎక్కువగా 'గేమ్ చేంజఋ పై నెగిటివ్ వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఫర్ ద ఫస్ట్ టైం డైరెక్టర్ శంకర్ స్పందించారు . గేమ్ చేంజర్ పై వస్తున్న నెగిటివ్ ఫీడ్ బ్యాక్ గురించి మాట్లాడారు . దీంతో సినిమా ఫ్లాప్ అయ్యిన మాట నిజమే అని పరోక్షకంగా శంకర్ ఒప్పుకున్నట్లైంది.
"ఈ సినిమాపై నెగిటివ్ టాక్ రావడం నాకు కొంచెం అసంతృప్తిగా ఉంది . గేమ్ చేంజర్ అవుట్ పుట్ తో నిజంగానే నేను హ్యాపీగా లేను . ఈ సినిమా నిడివి 5 గంటలు ఉంది అని .. ఆ కారణంగానే కొన్ని మంచి మంచి సీన్స్ కట్ చేసేసాము . దీంతో అసలు కథ ఏంటి..? అనే విషయం జనాలకు అర్థం కాలేకపోయింది. సినిమాలో మంచి మంచి సీన్స్ కట్ అయిపోయాయి. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. సినిమాకు వచ్చిన రివ్యూలను ఇప్పటివరకు నేను చూడలేదు . సినిమా చేసి మూడేళ్లు అయింది అని అందరూ అంటున్నారు.. కానీ సంవత్సరం ఆ పెచ్చు ఆరు నెలలు మాత్రమే మేము ఈ సినిమాని తెరకెక్కించాం. వేరే కారణాలవల్ల ఈ సినిమా కొంచెం ఆలస్యమైంది . దాంతో బడ్జెట్ కూడా పెరిగిపోయింది . అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను . ఆయన ఒక మంచి నటుడు . ఎస్ జే సూర్య నటన కూడా చాలా బాగుంటుంది "అంటూ గేమ్ చేంజర్ సినిమా ట్రోలింగ్ పై శంకర్ స్పందించారు..!