సంక్రాంతికి వస్తున్నాం : డిజిటల్ హక్కులను దక్కించుకున్న క్రేజీ సంస్థ.. ఏకంగా అన్ని కోట్లా..?

frame సంక్రాంతికి వస్తున్నాం : డిజిటల్ హక్కులను దక్కించుకున్న క్రేజీ సంస్థ.. ఏకంగా అన్ని కోట్లా..?

Pulgam Srinivas
విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరోయిన్ నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణులు అయినటువంటి ఐశ్వర్య రాజేష్ , మీనాక్షి చౌదరి కే మూవీ లో వెంకటేష్ కి జోడిగా నటించారు. బిమ్స్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు.

ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల చేశారు. ఇక గతంలో వెంకటేష్ , అనిల్ రావిపూడి , దిల్ రాజు కాంబోలో వచ్చిన ఎఫ్ 2 , ఎఫ్ 3 సినిమాలో మంచి విజయాలను సాధించి ఉండడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు అద్భుతమైన పాజిటివ్ రావడంతో ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు సూపర్ సాలిడ్ కలెక్షన్లు వచ్చాయి. అలాగే ఈ మూవీ కి రెండవ రోజు కూడా అద్భుతమైన కలెక్షన్లు ప్రపంచ వ్యాప్తంగా దక్కుతున్నట్లు తెలుస్తోంది.

దానితో ఈ సినిమా లాంగ్ రన్ లో బారి కలెక్షన్ వసూలు చేసే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి జీ 5 సంస్థ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత ఈ సినిమాను జీ 5 "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: