ఒక్క హిట్.. ఎన్నో ప్లాప్స్.. అయినా ఇన్ని సినిమాలా.. లక్ అంటే ఇది..?

Pulgam Srinivas
సినిమా ఇండస్ట్రీ లో కొంతమందికి హిట్స్ ఎక్కువ లేకపోయినా అద్భుతమైన సినిమా అవకాశాలు మాత్రం దక్కుతూ ఉంటాయి. అలాంటి వారిలో కావ్య దాపర్ ఒకరు. ఈమె కెరియర్ ప్రారంభంలో అనేక హిందీ సినిమాలలో నటించి ఆ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈ బ్యూటీ కొంత కాలం క్రితం ఏక్ మినీ కథ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. సంతోష్ శోభన్ హీరో గా రూపొందిన ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.


ఈ మూవీ తో కావ్య కు కూడా అద్భుతమైన గుర్తింపు తెలుగు సినిమా పరిశ్రమలో వచ్చింది. ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. కానీ విజయాలు మాత్రం ఆ స్థాయిలో దక్కడం లేదు. ఈమె కొంత కాలం క్రితం రవితేజ హీరో గా రూపొందిన ఈగల్ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన చాలా సినిమాలు పోయిన సంవత్సరం విడుదల అయ్యాయి. అందులో భాగంగా ఈమె నటించిన ఊరు పేరు భైరవకోన కాస్త పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.


ఇక ఈమె నటించిన సినిమాలలో పోయిన సంవత్సరం డబల్ ఇస్మార్ట్ , విశ్వం సినిమాలు విడుదల అయ్యాయి. ఈ రెండు సినిమాలు మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరచాయి. ఇకపోతే ఈమె నటించిన సినిమాలు ఎలాంటి రిసల్ట్ ను తెచ్చుకున్న ఈమె మాత్రం అదిరిపోయే రేంజ్ అందాలను ఆరబోస్తూ తన అందాలతో కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ ట్రీట్ ను అందిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: