ఆ స్టార్ కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనిరేషన్ తీసుకొని ప్రియమణి.. ఎందుకో తెలుసా..?

frame ఆ స్టార్ కోసం ఒక్క రూపాయి కూడా రెమ్యూనిరేషన్ తీసుకొని ప్రియమణి.. ఎందుకో తెలుసా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న సీనియర్ హీరోయిన్లలో ప్రియమణి ఒకరు . ఈ ముద్దుగుమ్మ జగపతి బాబు హీరోగా రూపొందిన పెళ్లైన కొత్తలో అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి విజయాన్ని అందుకొని అద్భుతమైన గుర్తింపును తెలుగు సినీ పరిశ్రమలో సంపాదించుకుంది. ఈ మూవీ లో ప్రియమణి తన నటనతో , అంతకుమించిన అందాలతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఆ తర్వాత ఈమెకు తెలుగులో పరుస పెట్టి అవకాశాలు దక్కాయి.

అందులో భాగంగా ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన యమదొంగ సినిమాలో హీరోయిన్గా నటించి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో ఈమె క్రేజ్ ఒక్క సారిగా తెలుగు లో పెరిగి పోయింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ కేవలం తెలుగు సినిమాల్లో మాత్రమే కాకుండా కొన్ని హిందీ సినిమాల్లో కూడా నటించింది. కొన్ని సంవత్సరాల క్రితం ఈమె షారుక్ ఖాన్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్గా రూపొందిన చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ స్పెషల్ సాంగ్ కోసం ఈ బ్యూటీ ఒక్క రూపాయి పారితోషకం కూడా తీసుకోలేదట.

అందుకు ప్రధాన కారణం ప్రియమణి కి షారుఖ్ ఖాన్ అంటే ఎంతో అభిమానం అంట. అంత అభిమానం ఉన్న హీరో సినిమాలో అవకాశం రావడంతో ఈమె ఒక్క రూపాయి కూడా పారితోషకం తీసుకోకుండా ఆ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిందట. ఈ మూవీ లోని స్పెషల్ సాంగ్ ద్వారా ప్రియమణి కి మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే షారుక్ కొంత కాలం క్రితం జవాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కూడా ప్రియమణి ఓ కీలకమైన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: