అనుష్క ఘాటి సినిమా నుంచి సంక్రాంతి స్పెషల్.. అదిరిపోయే గ్లింప్స్ వైరల్..!

frame అనుష్క ఘాటి సినిమా నుంచి సంక్రాంతి స్పెషల్.. అదిరిపోయే గ్లింప్స్ వైరల్..!

Divya
టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి అభిమానులు ఈమె సినిమాల విడుదల కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత అనుష్క నుంచి ఎలాంటి సినిమా అప్డేట్ రాలేదు. ఇటీవలె అనుష్క బర్త్ డే సందర్భంగా ఘాటి సినిమా షూటింగ్ జరగబోతుందని డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుందంటూ అనుష్క బర్త్ డే సందర్భంగా ఒక చిన్న గ్లింప్స్ రిలీజ్ చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా 80% పైగా పూర్తి అయ్యిందని టాక్ వినిపిస్తోంది ఈ ఏడాది ఈ సినిమాని రిలీజ్ చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తూందట. ఈ రోజున ఈ సినిమాలో నటించే హీరో గురించి ఒక అనౌన్స్మెంట్ చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఈ చిత్రంలో తమిళ హీరో విక్రమ్ ప్రభు మెయిన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో దేశి రాజు అనే పాత్రలో విక్రమ్ ప్రభు నటిస్తూ ఉండగా తాజాగా అందుకు సంబంధించి గ్లింప్స్ విడుదల చేశారు.

ఘాటి సినిమా తాజా గ్లింప్స్ విషయానికి వస్తే హీరోని పోలీసులు సైతం తరుముతూ ఉన్నట్టు చూపించారు. హీరో విక్రమ్ ప్రభు, అనుష్క బైక్పై ఏదో మూసుకొని వెళుతూ ఉన్నట్లుగా చూపించడం జరిగింది. వీరిద్దరి మధ్య జరిగే ఒక యాక్షన్ సన్నివేశం అన్నట్టుగా కనిపిస్తోంది. ఘాటి సినిమా ఏప్రిల్ 18వ తేదీన పాన్ ఇండియా లేవల్లో రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి సినిమా తర్వాత అనుష్క మరి సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గొనలేదు. మరి ఈ సినిమా కోసమైనా ప్రమోషన్స్ కోసం బయటికి వస్తుందా లేదా చూడాలి మరి. సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: