కల్కి -2: అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన అశ్వనీదత్.. ఈసారి ఎవరెవరంటే..?
కలియుగం అంతం అనీ విభజన కాన్సెప్ట్తో తెరకెక్కించిన ఈ సినిమా అద్భుతంగా ఆకట్టుకున్నది. అలాగే మహాభారత పాత్రలకు ఈ సినిమాని లింకు చేయడం మరింత హైలెట్గా అయ్యింది. కల్కి సినిమా చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. కల్కి సినిమా లో చివరిలో ట్విస్ట్ సస్పెన్స్ గా ముగించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. దీపికా పదుకొనేను తీసుకొని వెళ్లడంతో కథ చాలా మలుపు తిరుగుతుంది. ఇదే సెకండ్ భాగంలో ఎక్కడికి తీసుకువెళ్లారు అనే కదాంశంతో చూపించబోతున్నారట. తాజాగా అశ్వని దత్ సీక్వెల్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు.
కల్కి 2 సినిమా షూటింగ్ ఏప్రిల్ లో ప్రారంభించబోతున్నామని ఇప్పటికే కథను కూడా సిద్ధం చేశామని వచ్చే ఏడాదిలోనే ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. సినిమా కథను మరింత డెప్త్ గా చూపించేందుకే ప్రయత్నాలు చేస్తున్నామని కూడా వెల్లడించడం జరిగింది. రెండవ భాగంలో కమలహాసన్ పాత్ర చాలా పెద్దదిగా ఉంటుందంటూ తెలిపారు. ప్రభాస్, కమలహాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్ గా ఉంటాయని ఇందులో అమితాబచ్చన్ సైతం మరింత కీలకంగా నటించబోతున్నారంటూ తెలిపారు. సెకండ్ పార్టీలో కూడా చాలా మంది కొత్త నటీనటులు సైతం కనిపించబోతున్నారని తెలియజేశారు. నాగ్ ఈ స్క్రిప్ట్ అనుసరంగానే కొంతమంది నటీనటులను తీసుకోబోతున్నట్లు తెలియజేశారు నిర్మాత అశ్వని దత్.