ఆ స్టార్ హీరోతో శ్రీజ పెళ్లి చేయాలనుకున్న చిరంజీవి.. ఒక్క తప్పుతో మొత్తం చెడిందా..?
మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ కొణిదల గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. గ్లామర్ ఫీల్డ్ లోకి రాకపోయినా పర్సనల్ లైఫ్ ద్వారా శ్రీజ ఎక్కువగా పాపులర్ అయ్యారు. 2007లో శిరీష్ భరద్వాజ్ ను తన ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో నుంచి పారిపోయి మీడియా సపోర్ట్ తో శిరీష్ చేత మూడు ముళ్ళు వేయించుకున్నారు. అప్పట్లో చిరంజీవికి ఉన్న పేరు ... మెగా ఫ్యామిలీ ఇమేజ్ను గట్టిగానే డ్యామేజ్ చేశారు. శ్రీజ దంపతులకు ఓ పాప జన్మించింది. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ 2011లో విడాకులు తీసుకున్నారు. 2016లో చిరంజీవి తన కూతురు శ్రీజ కి చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ దేవ్ తో రెండో వివాహం జరిపించారు. తన మొదటి భర్త పాపను ఎత్తుకుని మరీ శ్రీజ పెళ్లి కూతురు గెటప్ లో ముస్తాబు అయ్యి రెండో పెళ్లి చేసుకోవడం కూడా అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
కానీ ఈ దంపతులకు కూడా ఒక పాప జన్మించాక విభేదాలతో అతడి నుంచి విడిపోయింది. ప్రస్తుతం ఇద్దరు కూతుళ్ళతో శ్రీజ సింగల్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే శ్రీజ అప్పట్లో శిరీష్ కోసం ఇంట్లో నుంచి పారిపోవటానికి ముందే ఆమె తన తండ్రి చెప్పినట్టు విని ఉంటే .. ఇప్పుడు ఓ టాలీవుడ్ స్టార్ హీరోకు వైఫ్ గా చలామణి అవుతూ ఉండేది. తన ఫ్యామిలీకి చెందిన ఒక హీరోకు ఇచ్చి పెళ్లి చేయాలని చిరంజీవి అనుకున్నారట చిరంజీవి. తన మేనల్లుళ్లో నే ఒకరిని తన అల్లుడుగా చేసుకోవాలని చిరు ఎంతో ఆశపడ్డారట. అయితే శ్రీజ చేసిన తప్పు వల్ల ఆ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకుంది.