సినిమా ఇండస్ట్రీలో ఒకరితో అనుకున్న సినిమాలను మరొకరితో రూపొందించడం చాలా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇకపోతే హీరోలు తమ దగ్గరకు వచ్చిన కథలను రిజెక్ట్ చేయడానికి అనేక కారణాలు ఉంటాయి. కొంత మంది సినిమా కథ నచ్చక మూవీలను రిజెక్ట్ చేస్తే , కొంత మంది కథలు అద్భుతంగా నచ్చిన తమ ఈమేజ్ కి ఆ సినిమాలు సెట్ కావు అని ఉద్దేశంతో మూవీలను వదిలేసిన వారు కూడా ఉన్నారు. అలా తమ ఈమేజ్ కి ఈ కథలు సెట్ కావు అనే ఉద్దేశంతో సినిమాలను వదిలేసిన హీరోల లిస్టులో చిరంజీవి , జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. మరి వీరిద్దరూ తమ కెరియర్లో కొన్ని సినిమాలను తమ ఈమేజ్ కారణంగా రిజక్ట్ చేయగా అవి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్న సందర్భాలు ఉన్నాయి. ఆ సినిమాలు ఏవో తెలుసుకుందాం.
కొన్ని సంవత్సరాల క్రితం అర్జున్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో మన్యంలో మొనగాడు అనే సినిమా వచ్చింది. ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కథను కోడి రామకృష్ణ మొదటి చిరంజీవి గారికి వినిపించాడట. కథ మొత్తం విన్న చిరంజీవి స్టోరీ సూపర్ గా ఉంది కానీ ఈ కథ నా ఈమేజ్ కి అస్సలు సెట్ కాదు. ఈ మూవీ నాపై తీస్తే వర్కౌట్ కాదు. నువ్వు వేరే వారితో చెయ్యి అని చెప్పాడట. దానితో అర్జున్ తో ఈ మూవీ ని కోడి రామకృష్ణ రూపొందించగా ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధార్థ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బొమ్మరిల్లు అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా కథను మొదట భాస్కర్ , తారక్ కి వినిపించాడట. సినిమా కథ మొత్తం విన్న తారక్ స్టోరీ సూపర్ గా ఉంది. కానీ నా సినిమాకు వచ్చే ఆడియన్స్ మాస్ డైలాగ్స్ , యాక్షన్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అవి లేకుండా సినిమా చేస్తే సినిమా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే నేను ఈ సినిమా చేయడం కరెక్ట్ కాదు. నువ్వు వేరే వారితో ఈ కథతో సినిమా చెయ్యి అని భాస్కర్ కి సలహా ఇచ్చాడట. ఇక ఈ కథతో భాస్కర్ , సిద్ధార్థ్ తో బొమ్మరిల్లు సినిమాను రూపొందించగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.