ఆ బ్యూటీతో నటిస్తే తారక్ బ్లాక్‍బస్టర్ గ్యారంటీ.. ఏకంగా అన్నిసార్లు అదే రిజల్ట్..?
తారక్ కెరియర్లో అద్భుతంగా కలిసి వచ్చిన హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ముందు వరుసలో ఉంటుంది. తారక్ , కాజల్ కాంబోలో మొత్తం నాలుగు సినిమాలు రాగా నాలుగు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. మొదటగా వీరి కాంబినేషన్లో బృందావనం అనే సినిమా వచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వీరి కాంబోలో బాద్ షా అనే సినిమా వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా విడుదల ఈ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వీరి కాంబోలో టెంపర్ అనే మూవీ వచ్చింది. మాస్ కమర్షియల్ అంశాలతో రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే కొంత కాలం క్రితం తారక్ "జనతా గ్యారేజ్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఇలా తారక్ , కాజల్ రూపొందిన ఈ నాలుగు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి.