స్టార్ హీరోయిన్ కావలసిన బ్యూటీ.. ఆ మిస్టేక్ తో కెరియర్ పరిస్థితి అలా..?

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో కి ఎంతో మంది నటీ మణులు ప్రతి సంవత్స రం ఎంట్రీ ఇస్తున్నారు . వారి లో కొంత మంది మాత్రం అద్భుతమైన విజయాలను అందుకుంటు స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటున్నారు . ఇక పోతే మరి కొంత మంది ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో అద్భుతమైన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్స్ స్థాయి కి వెళతారు అని చాలా మంది అనుకున్నా ఆ తర్వాత కొన్ని నిర్ణయాల ద్వారా వారికి అపజయాలు రావడం , ఆ తర్వాత వారి క్రేజ్ తగ్గడం వల్ల స్టార్ హీరోయిన్స్ స్థాయికి వెళ్లకుండానే వారి కెరియర్ ఆగిపోయిన బ్యూటీ లు కూడా కొంత మంది ఉన్నారు.


అలాంటి వారిలో రెజీనా ఒకరు. ఈ బ్యూటీ శివ మనసులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం అందుకోవడం , ఇందులో రెజినా తన అద్భుతమైన నటనతో , అంద చందాలతో ప్రేక్షకులను కట్టి పడేయడంతో ఈ మూవీ ద్వారా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ఈమె నటించిన కొన్ని సినిమాలు ప్రేక్షకులు బాగా ఆకట్టుకోవడం , అందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ బ్యూటీ చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్స్ స్థాయికి వెళుతుంది అని చాలా మంది భావించారు.
 


కానీ ఆ తర్వాత మాత్రం ఈమెకు సరైన విజయాలు దక్కకపోవడం వల్ల ఈమె క్రేజ్ క్రమ క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. దానితో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లాల్సిన ఈ బ్యూటీ మీడియం రేంజ్ హీరోయిన్ గానే కెరియర్ను గడపవలసి వస్తుంది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ నటి అనేక సినిమాలలో నటిస్తూ కెరియర్ ను బాగానే ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: