పుష్ప ది రూల్ మూవీ 50 రోజుల సెంటర్ల లెక్క ఇదే.. బన్నీకి అదిరిపోయే రికార్డ్!

Reddy P Rajasekhar
బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప ది రూల్ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పుష్ప ది రూల్ మూవీ ఇప్పటికే 1835 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ నెలాఖరు నుంచి పుష్ప2 మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది.
 
స్ట్రెయిట్, షిఫ్టెడ్ సెంటర్లతో కలిసి మొత్తం 500 స్క్రీన్లలో పుష్ప ది రూల్ మూవీ 50 రోజుల పాటు ప్రదర్శించబడుతోందని తెలుస్తోంది. ఒక విధంగా ఇది రికార్డ్ అనే చెప్పాలి. పుష్ప ది రూల్ ఇప్పటికే ఎన్నో రికార్డులను సొంతం చేసుకోగా 50 డేస్ సెంటర్లకు సంబంధించి ఈ సినిమాకు సొంతమైన రికార్డ్ ఇప్పట్లో బ్రేక్ కావడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
పుష్ప ది రూల్ మూవీ ఓటీటీలో ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ఇప్పటికే క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ అయ్యి రికార్డ్ స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకోవడం గమనార్హం. పుష్ప ది రూల్ సినిమా బన్నీకి బిగ్గెస్ట్ హిట్ అందించినా ఈ సినిమా రిలీజ్ తర్వాత బన్నీని పలు వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.
 
పుష్ప ది రూల్ మూవీ ఇతర భాషల ప్రేక్షకులకు సైతం ఎంతగానో నచ్చేయగా రీలోడెడ్ వెర్షన్ కు ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ అయితే రావడం లేదు. పుష్ప ది రూల్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రూల్ మూవీ రష్మికకు కూడా ఒకింత ప్లస్ అయిందని చెప్పవచ్చు. బన్నీ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: